)
Venom King Cobra Eating Snake Video Here: టెక్నాలజీలో ప్రపంచం శరవేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాను అయితే చదువురాని వారు కూడా ఎంతో సులభంగా ఆపరేట్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా చక్కగా యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ప్రతి ఒక్క షార్ట్ వీడియోను తప్పకుండా చూస్తూ.. ఉన్నారు. కొంతమంది అయితే జంతువులకు సంబంధించిన వీడియోలతో పాటు పాముల షార్ట్ వీడియోలను కూడా చాలామంది ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా కూడా ఓ పాముకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఆకలితో ఇతర పామును తినేందుకు ప్రయత్నిస్తున్న వీడియోనే వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో ముందుగా పాములను పెంచుతున్న ఒకరు చనిపోయిన ఒక పామును డబ్బాలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ముందు ఉంచడం మీరు గమనించవచ్చు. ఆ పామును చూసి కింగ్ కోబ్రా నెమ్మదిగా అక్కడి నుంచి దానిని వేటాడేందుకు ముందుకు ముందుకు రావడం మీరు గమనించవచ్చు. దీనిని గమనించిన ఆహారం పెట్టే వ్యక్తి ఆ చనిపోయిన పాములు పైకి లాగడం మీరు గమనించవచ్చు. ఇలా కొద్దిసేపు ఆ పాముతో సరదాగా ఆడుకొని.. చివరకు ఆ వ్యక్తి చనిపోయిన పాములు దానికి ఆహారంగా వేశాడు.
ఈ వీడియోలో ఆ వ్యక్తి ఆహారంగా వేసిన పాములు కింగ్ కోబ్రా ఏమాత్రం తోటి పామని గమనించకుండా దాని తలభాగాన్నిపట్టి నెమ్మదిగా తినడం ప్రారంభించింది. దీంతో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్ అవుతూ వస్తున్నాయి. సాధారణంగా మలేషియన్ కింగ్ కోబ్రాలతో పాటు అత్యంత పెద్ద ప్రమాదకరమైన నాగుపాములు చిన్న చిన్న కొండచిలువలపై దాడి చేసి వాటిని మాత్రమే చంపుకుని తింటాయట. లేదంటే ఇతర పాములపై దాడి చేసి వాటిని వాటిని తింటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆ యువకుడు ఆ కింగ్ కోబ్రాకి చనిపోయిన పామును ఆహారంగా వేసారని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఈ వీడియోను చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా పాములు, ఇతర జాతికి సంబంధించిన పాములను తినడమేంటని.. సందేహం వ్యక్తం చేస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి