Latest Viral Video Watch Here: ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జిల్లాలోని పాట్లాపూర్ గ్రామంలో ఓ వింత సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంగళవారం వృద్ధ దంపతులు తమ ఇంటి పక్కనే ఒక పెద్ద గుంతను తవ్వి.. అందులో వారిద్దరిని పూడ్చమని ఇతరులను కోరడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆ వృద్ధ దంపతులు ఇలా సజీవ సమాధి ఎందుకు కావాలనుకుంటున్నారో? అసలు అక్కడ ఏం జరిగిందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పాట్లాపూర్ గ్రామంలో ఆ వృద్ధులు గతంలో ప్రభుత్వానికి సంబంధించిన ఓ భూమిలో చిన్న ఇల్లు నిర్మించుకుంటారు. అయితే దీనిని గుర్తించిన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ వృద్ధ భార్యాభర్తలిద్దరూ కలిసి తమ ఇంటి పక్కనే ఉన్న ప్రాంతంలో ఒక తవ్వి, వారికి వారే అందులో దిగి సజీవంగా పోర్చమని స్థానికులను అడుగుతారు. దీంతో వారు గ్రామ శాఖ అధికారులకు సమాచారం అందిస్తారు..
UP : जमीन ना मिलने पर देवरिया में पति-पत्नी ने ली भू-समाधि, सरकारी जमीन पर चाह रहे थे कब्जा
◆ SDM ने कहा, "दंपत्ति को कब्जा नहीं मिला, इसलिए उन्होंने भू-समाधि लेने की कोशिश की"#Deoria | Uttar Pradesh | #UttarPradesh | Deoria pic.twitter.com/tOTLyHa8P9
— News24 (@news24tvchannel) April 17, 2025
గ్రామ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని వారిద్దరిని ఆ గుంతలో నుంచి తీసే ప్రయత్నం చేస్తారు. గ్రామ సభలో భాగంగా వారు ఆక్రమించిన భూమిని సేకరించడంతోనే ఈ వృద్ధ జంట ఇలా నిరసన తెలిపిందని స్థానిక అధికారులు తెలుపుతున్నారు. అయితే ఆ అధికారులు కూడా కాస్త భయాందోళనకు గురై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించగా వారు కూడా అక్కడికి చేరుకున్నారు. సాలెంపూర్ SDM దిశా శ్రీవాస్తవ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ దంపతులకు చట్టాన్ని వివరించడానికి ప్రయత్నించారు
బాధిత రమణరేష్ భార్య గుచ్చి దేవి ఆ భూమి పై ఎన్నో ఆశలు పెట్టుకోవడంతో ఎంతో బాధకు గురై.. ఏ అధికారి వచ్చిన మా యూపీ భూమిని, ఇల్లు తిరిగియలేమంటూ అధికారుకు వెల్లడించింది. అయితే జిల్లా స్థాయి అధికారులు ఎంతో కష్టపడి, గంటల తరబడి ఒప్పించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వారి ఇంటికి తరలించారు. అంతేకాకుండా వారు ప్రభుత్వ భూమిలో కట్టుకున్నప్పటికీ వారి చుట్టుపక్కలే చాలా మంది కూడా ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మించుకున్నారు వారిని ఏమాత్రం ఖాళీ చేయించకుండా.. తమపై వివక్షత చూపుతూ ఖాళీ చేయించడం సరైనది కాదని వృద్ధ దంపతులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. వీటిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అధికారులను ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









