
Husband arranges wife marriage with her lover in up video: ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో వివాహేతర సంబంధం ఘటన తెర మీదకు వచ్చింది. యోగేష్ తివారీ (40)కి, సోని (30)తో 2010లో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది (35) అనే వ్యక్తితో సోనికి కొంతకాలంగా ఎఫైర్ నడుస్తుంది.
భర్త పలు మార్లు దీనిపై భార్యకు నచ్చ చెప్పాడు. కానీ ఆమె మాత్రం విన్పించుకోలేదు. ఈక్రమంలో ఇటీవల వీరి మధ్య గొడవలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇటీవల సోని తన పుట్టింటికి వెళ్లి, సోమవారం తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అదే రోజు వికాస్ కూడా వారి గ్రామానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వికాస్‌ను గమనించిన యోగేష్.. అక్కడ కూడా ఇద్దరు కలుసుకున్నారా అంటూ గొడవలకు దిగాడు.
जान हैं तो जहान हैं....
योगेश को अपनी पत्नी सोनी की प्रेम कहानी का पता चला तो उसने उसकी शादी प्रेमी से ही मंदिर में करवा दी राजेश और सोनी की शादी 15 साल पहले हुई थीं अब सोनी अपने 10 साल के बेटे के साथ प्रेमी के घर चली गई मामला कानपुर देहात का है #KanourDehat @askrajeshsahu pic.twitter.com/juhcvX6ivv
— Alok Kumar /आलोक त्रिपाठी (@Aloktripath410) June 25, 2025
వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. గ్రామ పెద్దలతో పంచాయతీ ఏర్పాటు చేయించాడు.సోనీ తన ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడుతు తన మనసులోని మాటను చెప్పింది. ఈ క్రమంలో యేగేష్ సైతం.. తన 15 ఏళ్ల బంధానికి బ్రేకప్ చెప్పేశాడు. అందరి ముందు.. తన భార్యకు, ఆమె ప్రియుడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు గ్రేట్ భయ్యా.. కనీసం ప్రాణాలు అయిన మిగిలాయని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.మరికొంత మంది పోతే పోనీలే..నువ్వు హ్యాపీగా ఉండొచ్చని కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.