Husband Gift: భర్త సర్‌ప్రైజ్‌కు భార్య రిటర్న్‌ సర్‌ప్రైజ్‌.. దెబ్బకు లగ్జరీ కారు చెత్తడబ్బాలోకి..

Husband Dumps Porsche Car In Garbage Container Know Why: తన భార్యకు సర్‌ప్రైజ్‌గా ఖరీదైన కారును ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గిఫ్ట్‌ ఇవ్వగా అయితే భార్య షాకిచ్చింది. తనకు నచ్చలేదని చెప్పడంతో అతగాడు వెంటనే చెత్తడబ్బాలోకి తోసేశాడు. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 27, 2025, 02:50 PM IST
Husband Gift: భర్త సర్‌ప్రైజ్‌కు భార్య రిటర్న్‌ సర్‌ప్రైజ్‌.. దెబ్బకు లగ్జరీ కారు చెత్తడబ్బాలోకి..

Porsche Macan Car In Garbage: ఫ్రిబవరి నెలను ప్రేమికుల మాసంగా పేర్కొంటారు. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భార్యకు ఎంతో ప్రేమగా సర్‌ప్రైజ్‌ చేద్దామని ప్లాన్‌ వేసుకున్నాడు. అత్యంత విలాసవంతమైన ఖరీదైన కారును కానుకగా ఇవ్వాలని ఆర్డర్‌ ఇచ్చాడు. ప్రేమికుల దినోత్సవం రోజు భార్యకు 'సర్‌ప్రైజ్‌' అంటూ కారును తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు. అయితే ఆ కారు కాస్త భార్యకు నచ్చలేదు. తమ మధ్య ఏర్పడుతున్న చిన్న చిన్న గొడవలు తగ్గుతాయని భావించగా.. మరింత పెరిగాయి. దీంతో ఆ కారును కాస్త తీసుకెళ్లి చెత్త కంటైనర్‌లో పడేశాడు. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Marry Or Will Be Fired: బ్రహ్మచారులకు కంపెనీ నోటీసు వైరల్‌.. 'పెళ్లి చేసుకోకుంటే జాబ్స్‌ తీసేస్తాం!'

చైనా రాజధాని మాస్కోకు సమీపంలోని మైటిష్చ్‌ ప్రాంతానికి చెందిన ఓ భర్త తన భార్యతో తరచూ జరుగుతున్న చిన్న చిన్న తగాదాలను పరిష్కరించుకుందామని ప్రేమికుల దినోత్సవాన్ని వాడుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం రోజు తన భార్యకు ఖరీదైన ఎస్‌యూవీ పోర్చె కారు కొనుగోలు చేశాడు. దాని ధర 3 మిలియన్‌ రూబ్లెస్‌ అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.27 లక్షలు ఉంది. అయితే కొన్న తర్వాత జరిగిన చిన్న ప్రమాదంలో ఆ కారుకు కొన్ని చోట్ల దెబ్బలు తగిలాయి. సొట్టలు పడడం.. పలుచోట్ల డ్యామేజ్‌ జరిగింది. అయినా కూడా తన భార్యకు ఆ కారును ఎంతో ప్రేమగా బహూకరించాడు.

Also Read: Amberpet Flyover: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ప్రారంభం

అయితే డ్యామేజ్‌ అయిన కారు ఇవ్వడంతో భార్యకు చిర్రెత్తుకొచ్చింది. 'నాకు వద్దు' అంటూ తిరస్కరించింది. గొడవలు సద్దుమణగాల్సి ఉండగా మరింత పెరిగాయి. ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త వెంటనే ఆ కారును తీసుకెళ్లి చెత్త కంటైనర్‌లో పడేశాడు. కంటైనర్‌లో ఆ కారు పడి ఉండడంతో ఆ కారు వైరల్‌గా మారింది. కారును చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఆ కారు ఎందుకు పడేశాడనే కారణం తెలుసుకుని అందరూ విస్తుపోయారు. ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్న విధాలుగా స్పందిస్తున్నారు. 'భార్యలు అంతే! కారును చూడకుండా కారుకు ఉన్న సొట్టలు మాత్రమే చూస్తారు', 'వారికి ఎన్ని ఇచ్చినా వేస్టే' అంటూ ఇలా పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News