Video: నువ్వు కూడా సీఎం రేవంత్‌ పేరు మర్చిపోయావా తల్లి? ఇండియా టుడే యాంకరమ్మ ఏ పేరుతో పిలిచిందో చూడండి.. 

India Today Conclave CM Revanth Video: 'ఇండియా టుడే సమావేశం 2025' లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో  సీఎం రేవంత్ రెడ్డి పేరుని యాంకర్ మర్చిపోయింది 'మిస్టర్ మోడీ' అంటూ పిలిచి ఆ తర్వాత నాలుకరుచుకుని 'మిస్టర్‌ రెడ్డి' అని వ్యాఖ్యానించింది. ఆ వీడియో వైరల్ అవుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 8, 2025, 08:04 AM IST
Video: నువ్వు కూడా సీఎం రేవంత్‌ పేరు మర్చిపోయావా తల్లి? ఇండియా టుడే యాంకరమ్మ ఏ పేరుతో పిలిచిందో చూడండి.. 

 India Today Conclave CM Revanth Video:  ఇండియా టుడే యాంకర్ నోరు జారింది.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది. ఢిల్లీలో జరిగిన .ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2025' లో ఇండియా టుడే యాంకర్ .. నోరు జారి' మిస్టర్ రెడ్డి'కి బదులుగా 'మిస్టర్ మోడీ' అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత వెంటనే 'మిస్టర్ రెడ్డి 'అని పిలిచింది. కానీ ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా అవుతుంది. ఆ పేరు విన్న ఆడియన్స్ ఇతర పొలిటికల్ లీడర్స్ వెంటనే సరదాగా నవ్వారు. సీఎం రేవంత్ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ మీటింగ్‌లో పాల్గొని తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. అయితే గతంలో హీరో అల్లు అర్జున్ కూడా ఇలాగే నోరు జారారు ఈ నేపథ్యంలోనే ఆయన్ను 'సంధ్యా థియేటర్‌' ఘటనలో అరెస్టు చేయించారు. ఇది ప్రతికారచర్యగానే అని సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడారు. అప్పట్లో ఓ రేంజ్‌లో ఆ ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Add Zee News as a Preferred Source

ఆ తర్వాత మరో సమావేశంలో తెలుగు నటుడు, యాంకర్ బాలాధిత్య కూడా సీఎం రేవంత్ పేరును మర్చిపోయాడు. ఆయన కూడా మళ్లీ వెంటనే తప్పును సరిదిద్దుకున్నారు. ఆ వీడియో కూడా ఆ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది.. అయితే, ఇండియా టుడే ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం హైదరాబాద్ ముంబై, బెంగళూరు, ఢిల్లీ కాదు.. న్యూయార్క్, సియోల్, టోక్యోతో పోటీ పడుతుందని చెప్పారు.

ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రీతి చౌదరి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ డెవలప్మెంట్ అనేది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. కానీ తెలంగాణ అభివృద్ధి మాత్రం T-20 మోడల్ ర్యాపిడ్, డైనమిక్ అభివృద్ధి సాధించిందని చెప్పారు.

 

అంతేకాదు 30 వేల ఎకరాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం వరల్డ్ క్లాసు లెవెల్ హైదరాబాద్‌లో జరుగుతుందని వివరించారు హైదరాబాద్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అంతేకాదు హైదరాబాద్ అనేది ఒక రాత్రిలో జరిగింది కాదు 450 ఏళ్ల చరిత్ర కలిగింది. కుతుబ్షాహీల కాలం నుంచి ఈ అభివృద్ధి జరుగుతూ వస్తుంది అన్నారు.

ఇదీ చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడుత నిధుల మంజూరు తేదీ వచ్చిందోచ్‌.. ఎప్పుడో తెలుసుకోండి..

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో సమ్మిళితమైంది తెలంగాణ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనల ఓబిసి రిజర్వేషన్లు కేటాయించడంలో ఎంతో ఉపయోగకరం అన్నారు. ఇక హిందీ నేర్చుకోవడం అనేది ఒక ఛాయిస్ మాత్రమే అది ఇంపోజిషన్ కాదు.. విద్యార్థులకు ఫ్రెంచ్ లేదా జర్మనీ కాలేజీలలో నేర్చుకునే అవకాశం ఉండాలి అన్నారు.

ఇదీ చదవండి: రంగుల హోలీ ఆడుతున్నారా? ఇది లేకుంటే నష్టపోతారు జాగ్రత్త..

 

అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి హైదరాబాద్లో ఒలంపిక్స్ గేమ్స్ నిర్వహించాలని కోరారు ఇదివరకే హైదరాబాదులో వరల్డ్ మినిస్టర్ గేమ్స్ నేషనల్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ వంటివి సక్సెస్ విజయవంతంగా నిర్వహించారు కూడా నిర్వహించాలని కోరారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News