Indigo flight model autos enters in to market video: దేశ మంతట కూడా ఇండిగో విమానాల రద్దుతో జనాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల టూరిస్టులు కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఉద్యోగాలు, పెళ్లిళ్లు, శబరిమలకు వెళ్లాల్సిన వారు ఎక్కడికక్కడే విమానాశ్రయాల్లోనే నిలిచిపోయారు. ఇండిగో సిబ్బంది సింపుల్గా తమ విమానాలలో టెక్నికల్ సమస్యలు అంటూ ప్రకటించారు. దీంతో జనాలు ఆవేశంతో ఊగిపోయారు.
लो भाई मार्केट में अब इंडिगो ऑटो वाला भी आ गया है 🤣#IndiGoCrisis #indigoflight pic.twitter.com/rzRdoalDqL
— देश प्रेमी पवन (मोदी का परिवार) (@PawanM91) December 9, 2025
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం సీరియస్ కావడంతో ఇండిగో దిద్దుబాటు చర్యలకు దిగింది.దీనిపై ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. నిబంధనలు అనేవి ప్రజలకు మేలుచేయాలే కానీ సమస్యలుగా మారకూడదని అన్నారు. ఇప్పుడిప్పుడు ఇండిగొ విమానలు మరల మునుపటిలా సమస్యలులేకుండా నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం ఒక వ్యక్తి అచ్చం ఇండిగో లాంటి ఆటోను తయారుచేశాడు.
తన ఆటోకు అచ్చం ఇండిగో లాంటి డిజైన్ తో రెడీ చేశారు. అంతే కాకుండా కేవలం 10, 20 రూపాయాల్లో ఇండిగో విమాన ప్రయాణం అంటూ కూడా అందర్ని తన ఇండిగో ఆటోలో ఎక్కాలని కూడా కోరాడు. మొత్తంగా ఈవీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. సదరు ఆటోవాలా క్రియేటివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇండిగో విమానం ఎక్కలేని వారు కనీసం ఇండిగో ఆటో అయిన ఎక్కాలని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై కొంతమంది ఇండిగో ఎయిర్ లైన్స్ ఇజ్జత్ తీశారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









