Indonesia Blue colour Pit viper cobra snake video: చాలా మంది పాములు చూసిన వెంటనే భయంతో దూరంగా పారిపోతారు. మరికొందరు పాములు పేర్లు ఎత్తడానికి అస్సలు ఇష్టపడరు . కానీ కొందరైతే పాముల్ని అదేదో బొమ్మల్లా ఆడుకుంటారు.అడవులు, పొలాల్లో పాములు కన్పిస్తాయి. మనదేశంలో ఉన్నవి చాలా వరకు విషపూరితమైన పాములు కావు. అతి తక్కువ పాముల్లో మాత్రమే కోరల్లో విషం ఉంటుంది. పాములకు మనుషులను నడుస్తుంటే వారి పాదాల నుంచి తరంగాలు వాటికి తాకుతాయి.దీంతో పాములు ఆ ప్రదేశంలో నుంచి దూరంగా వెళ్లిపోతాయి.
అసలు పాములు మనుషులు ఉన్నచోట ఉండటానికి అస్సలు ఇష్టపడవు. ఎలుకల వేటలో అవి మనుషుల ఆవాసాలకు వస్తాయి. కొన్నిసార్లు పాములు మనుషుల్ని కాటు వేస్తాయి. ప్రపంచంలో కొన్ని పాములు కాటు వేస్తే మనిషి అస్సలు కదల్లేని స్థితిలోకి వెళ్లి వెంటనే చనిపొవడం కూడా సంభవిస్తుంది.
Trimeresurus insularis or Indonesian pit viper, with a baby snake
?Lika Ivanova / lika_pxl
pic.twitter.com/sO0Kh6wefE— Science girl (@gunsnrosesgirl3) February 9, 2024
ముఖ్యంగా పాములు ఒకవైపు ఎలుకల్ని తింటూ రైతులకు మేలుకూడా చేస్తాయి. అంతే కాకుండా స్నేక్ లను మన దగ్గర చాలా మంది దేవతల మాదిరిగా కొలుస్తారు. మరోవైపు పాముల్ని చంపితే.. కాలసర్పదోషాలు కూడా సంభవిస్తాయని చెబుతుంటారు.
ప్రపంచంలో అనేక రకాల పాములు ఉంటాయి. కొన్నిపాములు ఇంద్రధనస్సు రంగుల్లో కూడా ఎంతో అందంగా ఉంటాయి. ప్రస్తుతం బ్లూకలర్ పిట్ వైపర్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా బ్లూకలర్ పిట్ వైపర్ పాము.. ఇండోనేషియాలో ఎక్కుగా సంచరిస్తుంది. ఇది అత్యంత విషపూరితమైన పాము. ఇది కాటు వేసిన నిముషాల వ్యవధిలోనే మనిషి నురగ కక్కుకుని మరీ చనిపోతాడు.
మరోవైపు పాము విషం.. నాడీవ్యవస్థ, రక్తప్రసరణ సరఫరాలో ఆటంకం ఏర్పడేలా చేస్తుంది. అందుకే ఈపామును అత్యంత విషపూరీతమైన పాముల్లో ఒకటిగా చెప్తుంటారు. ప్రస్తుతంవైరల్ అవుతున్న వీడియోలో ఒక తల్లి బ్లూకలర్ పిట్ వైపర్,దాని పిల్ల రెండు కూడా ఒకదానికి మరోకటి చుట్టుకుని ఎంతో క్యూట్ గా కన్పిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









