)
Venomous King Cobra Video Watch: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో ప్రకార వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కొన్ని వీడియోలను చూసి ఆశ్చర్యపోయి ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలాంటి వీడియోలో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా కూడా ఓ పాము కు సంబంధించిన అత్యంత అరుదైన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముంది? సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
మనం అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వీటన్నిటికీ భిన్నంగా ఉంది. ఈ వీడియోలో ఓ యువకుడు ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తలభాగం పై ముద్దు పెట్టాడు. ఇండోనేషియాలోని బండంగ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన సాహబత్ ఆలం యువకుడు అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ముద్దు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 9 సెకండ్ల నిడివిగల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.
వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వీడియోలో ఒక యువకుడు అతడి చేతిలో అత్యంత ప్రమాదకరమైన పాము పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. అతను ఏమాత్రం భయం లేకుండా ఆ పామును తన మూతి దగ్గరికి తీసుకురావడం కూడా గమనించవచ్చు. ఇలా నెమ్మదిగా అతను ఆ పామును తన ముఖం దగ్గరికి తీసుకువచ్చి..ముద్దు పెట్టేసాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్ ఫోన్స్‌లో చిత్రీకరించారు. ఇలా రికార్డు చేసిన వీడియోని సోషల్ మీడియాలో వదిలారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది..
దీనికి సంబంధించిన వీడియోను ViralHog అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. దీనిని సోషల్ మీడియాలో ఏప్రిల్ 21వ తేదీ ఈ ఏడాదినే విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 4 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా 2000 మందికి పైగానే ఈ వీడియోను లైక్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే కొంతమంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోయిన వారు వారి అభిప్రాయాలను కామెంట్లలో కూడా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి పాములతో ఆటలాడే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి