)
Inland taipan attack eastern brown Snake video: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాముల వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిరోజు వెరైటీగా ఉండే పాములు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు వీటిని విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
The Inland Taipan, the world’s most venomous snake, with enough venom in a single bite to kiII 100 adult humans, is utterly powerless against the King Brown.
Fun fact: if you ever see ‘king’ in the name of snake species it (generally) means it eats other snakes! pic.twitter.com/rOejpIUlSh
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 8, 2025
అయితే.. ఆస్ట్రేలియాలో అత్యంత విషపూరీమైన పాముల్లో ఇన్లాండ్ తైపాన్ పాములు, కింగ్ బ్రౌన్ పాములు అని చెప్పవచ్చు. ఇన్లాండ్ తైపాన్ పాము ఒక్క కాటుతో వంద మంది మనుషులు ఇట్టేచనిపోతారు.దీని విషయం మెదడు, నాడీ వ్యవస్థ,రక్త ప్రసరణ వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుంది.
ఈ క్రమంలో ఇలాంటి భయంకరమైన ఇన్లాండ్ తైపాన్ పామును.. కింగ్ బ్రౌన్ పాము దాడి చేసి చంపేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.అడవిలో ఇన్లాండ్ తైపాన్ పాము చెట్లలో వెళ్తుంది. ఇంతలో దానికి ఎదురుగా కింగ్ బ్రౌన్ పాము అక్కడకు వచ్చింది.
ఇన్లండ్ తైపాన్ దాని మీదకు దాడికి ప్రయత్నించింది. ఇంతలో కింగ్ బ్రౌన్ చాకచక్యంగావెంటనే ఇన్లాండ్ తైపాను పామును ఒక్క ఉదుటున పట్టేసుకుంది. దాన్ని ఊపిరాడకుండా కర కర నమిలేసింది.
ఈ అరుదైన ఘటనను అక్కడున్న వారు వీడియో తీశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. పాము ఎంత డెంజర్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook