)
Women Farmer Found Diamond In Farm: పొలాన్ని నమ్ముకున్న రైతుకు.. కూలీలకు మూడు పూటలా ముద్ద దొరుకుతుంది. కాయాకష్టం చేసుకునే మహిళకు అదృష్టం వరించింది. పొలంలో పనులు చేస్తుండగా తళుకులీనుతున్న రాయి లభించింది. దాన్ని పరిశీలించి చూడగా అత్యంత ఖరీదైన వజ్రంగా తేలింది. వెంటనే ఆమె ఓ షావుకారి దగ్గరకు వెళ్లి ఇవ్వగా రూ.40 లక్షలకు అతడు కొనుగోలు చేశాడు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్‌లో వైరల్‌గా మారింది. వజ్రం లభించడంతో రాయలసీమ రతనాలసీమ అనే నానుడి నిజమని నిరూపితమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో వర్షాలకు రాళ్లు రత్నాలుగా మారుతాయని అందరికీ తెలిసిందే. తొలకరి జల్లుల నుంచి వర్షాకాలంలో రంగు రాళ్లు లభిస్తుంటాయి. రత్నగిరి, జొన్నగిరి అనే గ్రామాలు వజ్రాలు లభిస్తాయి. ప్రతి యేటా ఇక్కడి స్థానికులు వజ్రాలు ఏరుతూ భారీగా సంపాదిస్తున్నారు. తాజాగా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ మహిళ పంట పొలంలో పచ్చి మిర్చి పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది. దొరికిన వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ.40 లక్షలు నగదు ఇచ్చి కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన రాయి విలువ బహిరంగం మార్కెట్లో రూ.కోట్లలో పలుకుతుందని తెలుస్తోంది.
గతంలో జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళకు రూ.20 లక్షల వజ్రం దొరికింది. ఇప్పుడు రూ.40 లక్షల వజ్రం దొరకడంతో గ్రామంలో వజ్రాల అన్వేషణకు స్థానికులు పోటీపడుతున్నారు. మహిళలు కూలీ పనులు చేస్తుండగా ఎక్కువ వజ్రాలు దొరుకుతుండడ విశేషం. ఇక్కడ కూలీలు వజ్రాలపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో విలువైన వజ్రాలు దొరుకుతుండడంతో వజ్రాల అన్వేషణ వేగంగా జరుగుతుంది. దాదాపుగా 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వజ్రాలు పంట పొలాల నుంచి బయటకు తేలికగా విలువైన రాళ్లు కనిపిస్తున్నాయి. రంగురంగుల రాళ్లు.. వజ్రాలుగా మారుస్తున్నారు.
వివరాలు గోప్యం
వజ్రాల కోసం అన్వేషణ భారీగా సాగిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు అయితే అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా పరుస్తుందో అర్థం కావడం లేదు. ఒకరోజులో లక్ష అధికారుల నుంచి కోటీశ్వరులు అయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా రూ.40 లక్షల వజ్రం లభించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటారనే భయంతో రైతులు, కొనుగోలు చేసిన వ్యాపారస్తుల పేర్లు బయటకు రావు. వారి వివరాలు గోప్యంగా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.