)
Latest Viral Video Watch Here: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్నిచోట్లనైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. వాగు వంకలైతే ఏకంగా పొంగి పొరలుతున్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే కొన్నిచోట్ల నేషనల్ హైవేలు కూడా నీటితో పాటు కొట్టుకుపోయాయి. ఇలా దేశవ్యాప్తంగా విపరీతమైన వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించిపోతోంది. కొన్నిచోట్ల రాకపోకలు బంద్ కావడంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడి ఎలాగోలా రోడ్డుపై ప్రవహిస్తున్న వరదలను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు వ్యక్తులు తన జీపుతో నదిని దాటుతున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కారు నడుపుతూ నదిని దాటడానికి రెట్టింపు ధైర్యం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాహసాలు చేయాలనుకునే వారే ఈ పని వెనకాడరు. అయితే ఇటీవలే ఇద్దరు యువకులు ప్రవహిస్తున్న వరద నీటి నీటిలో నుంచి కారు నడుపుతూ కొట్టుకుపోయిన సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. నీటి తాకిడికి ఆ జీపు ఏకంగా మూడు పార్టీలు కొట్టి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన చండీగఢ్ సమీపంలోని నయాగావ్‌లో జరిగినట్లు సమాచారం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై ఒక నది నిండి వరద జలాలు ప్రవహించడం మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఆ వరదలు ఎంత స్పీడ్‌గా ప్రవహిస్తున్నాయో చూస్తే షాక్ అయిపోతారు.. ఇలాంటి ప్రమాదకరమైన వరదల్లో ఇద్దరు యువకులు జీపుతో నది దాటాలనుకున్నారు. ఇందులో భాగంగానే వారు ఒక పాత జీపుని తీసుకొని అవతలి ఒడ్డు నుంచి ఇవతల వడ్డీకి రావడం మీరు గమనించవచ్చు. మధ్యలోకి వచ్చేసరికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రవాహం తాకిడికి జీపు ఒక సైడు వెళ్లాల్సింది ఇంకో సైడ్ వెళ్తోంది.
వరద ప్రవాహం తీవ్రమవ్వడంతో జీపు అదుపుతప్పిపోయింది. అదే ప్రవాహం దాటికి జీపు రెండు మూడుసార్లు బోల్తా కొట్టి అదుపు తప్పి నదిలోకి వెళ్తోంది. అయితే, ఆ జీపులో ఉన్న వారు కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది. అయితే, వారిద్దరూ ఆ వరద నుంచి ఎలాగోలా బయటపడ్డట్లు సమాచారం. ఇప్పుడు వీరి సాహసాన్ని సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. సాధారణంగా ఇలా ప్రవాహం అధికంగా ఉన్నచోట జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ వీరు ఎంతో ధైర్యంగా అందులో నుంచి బయటికి రావాలని చూశారు.
Only an idiot would expect anything else. There’s a big line between foolishness and bravery. Video from Nayagaon Chandigarh as a Thar washed away by heavy river water flow. The only question is why risk your life? No machine can ever stand against the power of nature! pic.twitter.com/Y6QOj5sK9L
— Nikhil saini (@iNikhilsaini) August 24, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook