Judge romance with woman in video going viral: ఇటీవల కాలంలొ కొంత మంది ఉన్నత ఉద్యోగాలు, గొప్ప స్థానాల్లో ఉండి మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో కొంత మంది అధికారులు, రాజకీయ నాయకులు అందరికి ఆదర్శంగా నిలుస్తారు. వీరిని చూసి చాలా మంది వారిలాగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్లాన్ లు వేసుకుంటారు. ఇదంతా మనం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం కొంత మంది చాలా కాంట్రవర్సీగా ప్రవర్తిస్తున్నారు. అసలు వీళ్లు ప్రవర్తన చూస్తుంటే చాలా దారుణంగా ఉంటుంది.
Welcome to Digital India Justice ?
Court is online… but judge forgot it’s LIVE! ☠️
When tech meets tradition
— and the camera off button loses the case! ? pic.twitter.com/1GbfOFQ6w7— ShoneeKapoor (@ShoneeKapoor) October 15, 2025
మొత్తంగా వీరి వల్ల మొత్తంగా అందరు ఉద్యోగులు ఇలానే అంటూ చెడ్డపేరు వస్తుంది. సమాజంలో లాయర్లు, జడ్జీలకు ఎంతో గౌరవం ఉంటుంది. వీరు బాధితుల తరపున కోర్టులో తమ వాదనల్ని లాయర్ లు విన్పిస్తారు. జడ్జీలు వీరి వాదనలు విని సరైన తీర్పు ఇస్తారని భావిస్తారు. అయితే.. అలాంటి ఉన్నతమైన హోదాలో ఉన్న ఒక జడ్జీ తన స్థానంకు పూర్తిగా చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తించాడు.ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆన్ లైన్ లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి.
కోర్టుకు లాయర్ లు, పోలీసులు వస్తున్నారు. మరీ జడ్జీ కూడా ఆన్ లైన్ లో కోర్టుకు హజరయ్యారు. ముందే వచ్చి రెడీగా కూర్చున్నాడు. మరీ ఆయన తన లాప్ టాప్ లోని వీడియో మోడ్ ను ఆఫ్ లో చేసుకొవడం మర్చిపోయాడు. ఇంతలో ఒక మహిళలతో ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపుకు లాగి.. లిప్ లాక్ చేశాడు.
వీళ్ల రాసలీలలు.. లైవ్ లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు షాక్ కు గురయ్యారు. కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









