Kerala woman: 40 అడుగుల బావిలో పడిపోయిన భర్త.. భార్య చేసిన ఫిదా అవుతున్న నెటిజన్లు.. స్టోరీ ఏంటంటే..?

Daring kerala woman rescue husband: కేరళలో దంపతులు తోటలో మిరియాల తీగల నుంచి మిరియాల గింజలను బైటకు తీస్తున్నారు. అక్కడికి సమీపంలో ఒక బావి ఉంది. ఇంతలో సదరు వ్యక్తి బావిలోకి అదుపుతప్పి పడిపోయాడు.   

Written by - Inamdar Paresh | Last Updated : Feb 5, 2025, 07:33 PM IST
  • కేరళలో భర్త కోసం ప్రాణాలకు తెగించిన భార్య..
  • మహిళను ప్రశంసిస్తున్న నెటిజన్లు..
Kerala woman: 40 అడుగుల బావిలో పడిపోయిన భర్త.. భార్య చేసిన ఫిదా అవుతున్న నెటిజన్లు.. స్టోరీ ఏంటంటే..?

Kerala Woman rescued her husband from well: సాధారణంగా భార్య భర్తలు కష్టంలో సుఖంలో ఒకరికి మరోకరు అన్నట్లు ఉంటారు. ఒకరికి కష్టం వస్తే, మరోకరు విలవిల్లాడిపోతుంటారు. అయితే.. ఇటీవల కాలంలో భార్యభర్తలు దీనికి భిన్నంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుని ఒకరికి మరోకరు టార్చర్ చూపించుకుంటున్నారు. తమ వాళ్లను చంపేందుకు సైతం సిద్దంగా ఉంటున్నారు.

Add Zee News as a Preferred Source

పొరపాటున జీవిత భాగస్వామికి ఏదైన కష్టం వస్తే.. నాకేంమంటూ వదిలించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. కేరళలో జరిగిన సంఘటన మాత్రం దీనికి పూర్తిగా రివర్స్ లో ఉందని చెప్పుకొవచ్చు. 

కేరళలో ఒక తోటలో భార్యభర్తలు పొలంలో మిరియాల గింజల్ని కోస్తున్నారు. అది బావికి దగ్గరగా ఉంది. ఇంతలో సదరు మహిళ భర్త రమేశన్ బావిలోకి పడిపోయాడు. వెంటనే పెద్దగా నీళ్ల శబ్దం వచ్చింది. దీంతో అతని భార్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ప్రాణాలకు తెగించి 40 అడుగుల లోతున ఉన్న బావిలోకి దిగింది. 

 దాదాపు ఐదు అడుగుల నీరు ఉన్న బావి అడుగు భాగానికి చేరుకున్న తర్వాత, ఆమె రమేశన్‌ను పైకెత్తి గట్టిగా పట్టుకుంది. సహాయం కోసం గట్టిగా కేకలు పెట్టింది. దీంతో అక్కడున్న స్థానికులు బావి దగ్గరకు చేరుకున్నారు. దాదాపు.. 20 నిముషాల పాటు ఇద్దరు బావిలోనే ఉండిపోయారు.  ఆతర్వాత ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహిళ ధైర్యం చేసి బావిలో దిగి భర్తను పట్టుకొవడం వల్ల అతను ప్రాణాలు నిలిచాయి.

Read more; Viral Video: బాప్ రే... నరాలు తేగె ఉత్కంఠ.. ఒకే బావిలో పడ్డ పెద్దపులి, అడవి పంది.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో వైరల్..

ఫైర్ సిబ్బంది వలను ఏర్పాటు చేసి బావిలోకి దించి ఇదర్ని బైటకు తీశారు.  ప్రస్తుతం భార్యభర్తలు ఇద్దరు ప్రమాదం నుంచి బైటపడ్డారు. అయితే.. బావిలో పడగానే మహిళ ధైర్యంతో వెళ్లడం వల్ల ఈ రోజు అతగాడు ప్రాణాలతో ఉన్నాడని.. సదరు మహిళను అందరు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి భర్త కోసం భార్య చూపించి తెగువ, సాహాసం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News