)
King Cobra Video Watch Here: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే కనిపిస్తూ ఉన్నాయి.. కొంతమంది స్నేక్ క్యాచర్స్ రిస్కు తీసుకొని మరి పాములు పట్టుకుంటున్న సందర్భంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది ఇలాంటి సందర్భాల్లో గాయపడిన వారు కూడా ఉన్నారు. నిజానికి ఏది ఏమైనా చాలామంది పాములను పట్టుకుంటున్న సమయాల్లో తప్పకుండా వీడియోలు తీస్తున్నారు. అయితే, తాజాగా ఇలా తీసి పోస్ట్ చేసిన వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా నాగుపాములను పట్టుకునే క్రమంలో తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పాములు చాలా చురుకుగా ఉంటాయి. అన్ని పాముల కంటే ఎక్కువగా ఒకచోట నుంచి మరొక చోటికి వెళుతూ ఉంటాయి. అందుకే చాలామంది ఈ పాములను పట్టుకునే క్రమంలో ఒకటికి రెండు ఆలోచిస్తూ.. వాటి దాడి నుంచి తప్పించుకుంటూ పట్టుకుంటూ ఉంటారు. చాలామంది వీటికాటు బారిన పడి మరణించిన వారు కూడా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది స్నేక్ క్యాచర్స్ కూడా పట్టుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
తాజాగా కూడా పోస్ట్‌నే క్యాచర్ ఎంతో జాగ్రత్తగా పామును పట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అతను పామును ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించడానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. అయితే, ఆ కింగ్ కోబ్రా ప్లాస్టిక్ డబ్బా తన తలపైకి తేగానే ఎంతో చాకచక్యంగా దాని నుంచి తప్పించుకుంటుంది. అలాగే అతను కూడా ఆ పాము తలభాగంలో డబ్బాను ఉంచి.. పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా కొద్దిసేపటి వరకు చేస్తూనే ఉంటాడు. చివరికి ఆ నాగుపామును డబ్బాలు బంధించడం మీరు క్లియర్ గా చూడొచ్చు.
సాధారణంగా ఇలా పట్టుకోవడం చాలా ప్రమాదకరమైనప్పటికీ.. నైపుణ్యం ఉన్నవారు ఇలానే పట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఆ డబ్బాకు రంధ్రాలు చేసి నాగుపాముకు శ్వాసడేలా చేసి.. కొద్దిరోజులు వారి దగ్గరే ఉంచుకొని అడవిలో సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెడుతూ ఉంటారు. తాజాగా కూడా అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ కూడా ఇదే పని చేశాడు. ఆ పాముని పట్టుకుని సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈ దృశ్యాలే ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి