)
King cobra brutally Attacks and Eating Snake Video: పాముల వీడియోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పాములే డెంజర్ అంటే కింగ్ కోబ్రాలు ఇంకా డెంజర్. వీటిని చూస్తేనే ప్రాణాలు అటే పోతాయి. అది పొరపాటున కాటు వేస్తే సెకన్ల వ్యవధిలో మనిషి ప్రాణాలు కోల్పోతాడు.
అంతే కాకుండా.. కింగ్ కోబ్రా గూడు కట్టుకుని పిల్లల్ని కంటుంది. ఇది రాత్రిపూట ఎక్కువగా వేటకు వెళ్తుంది. తన కన్నా చిన్న పాముల్ని అమాంతం దాడి చేసి మింగేస్తుంది. ఈ క్రమంలో కింగ్ కోబ్రాలు ఇతర పాముల కన్నా చాలా డెంజర్ అని చెప్తుంటారు. ప్రస్తుతం ఒక భారీ కింగ్ కోబ్రా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దీనిలో భారీ కింగ్ కోబ్రా దగ్గరకు ఒక చిన్న పాము వచ్చినట్లుంది. ఇంతలొ అది కోపంగా దాని మీద దాడి చేసి నోట్లొ పట్టేసుకుంది. అంతేకాకుండా.. పామును కొరుకుతూ, అది ఎంతగా విడ్పించుకుందామని చూసిన కింగ్ కోబ్రా ఆ చాన్స్ ఇవ్వలేదు.
పామును కోపంగా బుసలు కొడుతూ చూస్తు నాతోనే పరాచకాలా అంటూ ఆవేషంతో ఊగిపోయింది. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ఇంతలో అది వెంటనే తన వేటను తీసుకుని పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.