King Cobra Drinking Water Viral Video: ప్రపంచవ్యాప్తంగా జనాలు పెరిగే కొద్దీ మానవ ఆవాసాలను ఏర్పరచుకోవడం కోసం అడవులను, వ్యవసాయ భూములను నాశనం చేసి వాటిల్లో కొత్త ఇల్లు నిర్మించుకొని నగరాలుగా పేర్లు పెట్టుకుంటున్నారు. దీని కారణంగా అడవిలో సంచారాలు చేసి జంతువులు మానవ ఆవాసాల్లోకి ప్రవేశించి హాని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పాము కు సంబంధించిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
చైనాలోని ఓ అడవి ప్రాంతంలో నివాసితముంటున్న ఓ వ్యక్తి ఇంట్లోకి అతి భయంకరమైన కింగ్ కోబ్రా పాము సంచారం చేసింది. అయితే ఆ పాము కాస్త గాయాలతో ఉండటం వల్ల ఇంటి యజమాని స్నేక్ క్యాచర్స్‌కి ఇన్ఫర్మేషన్ అందించారు. వారు అక్కడికి చేరుకొని ఆ పామును రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆ పాము గాయాలతో ఉండడం, కాస్త నీరసంగా కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ తో పాముకు నీటిని తాగించారు. ఇలా వారు ఆ బాటిల్ లోని నీటిని పాముకు తాగించగా.. పాము ఏమాత్రం భయపడకుండా అందులో నీటిని నెమ్మది నెమ్మదిగా తాగేందుకు ప్రయత్నించింది. ఈ సన్నివేశాలను అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ పోస్టు కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
Interesting method for catching snakes pic.twitter.com/Fw816roCRU
— Crazy Clips (@crazyclipsonly) February 13, 2025
ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోను @crazyclipsonly అనే X యూజర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక చిన్న నాగుపాము ఇంట్లోకి ప్రవేశించడం మీరు గమనించవచ్చు.. అయితే ఆ పామును పట్టుకుంటున్న కొంతమంది స్నేక్ క్యాచర్స్ బాటిల్ తో నీటిని తాగిపించడం మీరు గమనించవచ్చు. ఓ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా వట్టి చేతులతో పాముకు నీటిని పట్టించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాము చాలా ప్రమాదకరమైందని తెలిసినప్పటికీ.. ఆ వ్యక్తి భయం లేకుండా పాముకు నీటిని పట్టించడం పై సోషల్ మీడియా వినియోగదారులు స్పందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









