
Rare Nagamani Viral Video Watch: నాగమణి వజ్రం గురించి పూర్తిగా ఎంతమందికి తెలుసు.. ఇది ఒక పూరతమైన రహస్యమైన రత్నంగా భావిస్తారు. ఈ రత్నం నాగుపాముల తలపై ఉంటుందని నమ్మతూ ఉంటారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల అదృష్టవంతులవ్వడమే కాకుండా ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారని అనేక మంది విశ్వసిస్తారు. అంతేకాకుండా దీనిని ధరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా దూరమవుతాయని ఒక నమ్మకం. పురాణాల్లో ఈ నాగమణి రత్నానికి సంబంధించిన అనేక వివరాలను క్లుప్తంగా వెల్లడించారు.
పూర్వీకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రత్నం కేవలం కోబ్రా జాతికి సంబంధించిన శక్తివంతమైన వృద్ధ పాములతో పాటు శక్తివంతమైన పాముల తలపై మాత్రమే కనిపించేదట.. అయితే ఈ మణి అనేది నాగుపాము తలపై సహజంగానే ఏర్పడుతుంది. నాగుపాము శక్తిని బట్టి ఆ రత్నంలోకి మాయాశక్తులు వస్తాయని సమాచారం. కొంతమంది తెలిపిన వివరాల ప్రకారం, నాగుపాముకు ఉండే విషం గట్టిపడడం వల్ల ఈ అరుదైన నాగ రత్నం ఏర్పడుతుందట.. ఇంకొతమందైతే.. ఈ నాగమణి స్టోన్ అనేది దేవతలు ఇచ్చిన వరమని నమ్ముతూ ఉంటారు.
రియల్ నాగమణి చాలా అరుదుగా లభిస్తుంది. ఇది చికట్లో కూడా ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఓ ప్రత్యేకమైన కాంతి స్వభావం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది వివిధ కలర్స్‌లో ఉంటుందని కూడా సమాచారం. కొన్ని రత్నాలు ఆకు పచ్చ కలర్లో ఉంటే మరికొన్ని ఎరుపు రంగులో ఉంటాయి. ఇలా అద్భుతమైన కాంతి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి చీకట్లో కూడా ఎంతగానో మెరుస్తాయి. ఈ రత్నం కలిగిన పాములను సులభంగా గుర్తపట్టొచ్చు. అంతేకాకుండా సులభంగా కనిపిస్తూ ఉంటాయి.
నాగమణి స్టోన్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన చాలా నెటిజన్స్ మంది ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఇలాంటి వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @SsBolgSsBolg అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. నాగమణి స్టోన్ అనే ట్యాగ్స్ పెట్టి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని వేయిల నెటిజన్స్ వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది లైక్ కూడా చేశారు. ఇది చాలా రేర్ సంఘటన అని వీడియోలో ఓ వ్యక్తి చెప్పడం మీరు గమనించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook