Rare King Cobra Guards Viral Video: ఇంటికి కాపలాగా కింగ్ కోబ్రా.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Rare King Cobra Guards Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఇంటికి కాపలాగా కాస్తున్న పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 7, 2025, 07:19 AM IST
Rare King Cobra Guards Viral Video: ఇంటికి కాపలాగా కింగ్ కోబ్రా.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Rare King Cobra Guards Viral Video​: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులు పాములకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నాగుపాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా విషపూరితమైన కింగ్కోబ్రాలు ఇళ్లలోకి సంచారం చేయడం, స్నేక్ క్యాచర్స్ వాటిని పట్టుకోవడానికి సంబంధించిన వీడియోలు మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కొంతమంది స్నేక్  క్యాచర్స్ అయితే ప్రాణాలను పణంగా పెట్టి పాములను రక్షించే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో షేర్ చేసిన క్షణాల్లోనే కండంతరాలు దాటి కోట్లను వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో కూడా ఇలానే వైరల్ అవుతూ వస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు ఓ విషపురితమైన కింగ్ కోబ్రా మీరు చూడవచ్చు.. వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ కింగ్ కోబ్రా తలుపులపై ఉండే గడిపై పడగ తీసి అటు ఇటు చూడడం మీరు గమనించవచ్చు. సాధారణంగా పాములు ఇళ్లలోకి సంచారం చేసే క్రమంలో ఇలాంటి తలుపుల నుంచి ఇంట్లోకి దూరుతూ ఉంటాయి. కానీ ఈ పాము మాత్రం సాధారణంగా తలుపు గడెంపై అటు ఇటు పడగ తీసి చూడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది వింత వింత కామెంట్లు చేస్తున్నారు.. చాలామంది దీనిని చూసినవారు ఇది ఇంటికి కాపలాగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. 

సాధారణంగా పాములన్ని సందు దొరికిందంటే ఇంట్లోకి వెళ్లి ఎక్కడో ఒకచోట నక్కి ఉంటాయి. కానీ ఈ పాము మాత్రం తలుపులకే చుట్టుకొని ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పాము కు సంబంధించిన వీడియోను @సబీనా సుల్తానా అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ షార్ట్ వీడియోను దాదాపు కొన్ని వేల మందికి పైగా వీక్షించారు. అలాగే కొంతమంది లైక్ కూడా చేశారు. ఇక ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయిన వారు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ పాము ఏం చేస్తుంది?, ఇదేంటి ఇలా కొత్తగా ఉంది? అనే కామెంట్లను సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా పెడుతున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News