King Cobra Kisses Video Watch: వామ్మె.. కింగ్‌ కోబ్రాను ముద్దు పెట్టుకున్న యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

King Cobra Kisses Video Watch Now: సాధానంగా కింగ్‌ కోబ్రా పాములను పట్టుకోవడం చూసి ఉంటారు. కానీ దానిని ఎప్పుడైనా ముద్దు పెట్టుకోవడం చూశారా? దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 10, 2025, 08:41 AM IST
King Cobra Kisses Video Watch: వామ్మె.. కింగ్‌ కోబ్రాను ముద్దు పెట్టుకున్న యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

King Cobra Kisses Video Watch Now: కింగ్ కోబ్రాలను ప్రపంచంలో అత్యంత పొడవైన, విషపూరితమైన పాములుగా చెప్పుకుంటారు. ఈ పాములు 13 అడుగుల పొడవు వరకు పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని కింగ్‌ కోబ్రా పాములైతే దాదాపు 18 అడుగుల వరకు పొడవు ఉంటాయి. ఇవి చాలా ప్రత్యేమైన శరీరాన్ని కలిగి ఉంటాయి. ఈ పాములు ఆహారంగా కేవలం ఇతర పాములతో పాటు చిన్న చిన్న కప్పలను, ఇతర జంతువులను మాత్రమే చంపుకు తింటాయి. ఇవి కేవలం పాములకు సంబంధించిన ఆహారాలు మాత్రమే తింటూ ఉంటాయి. కాబట్టి వీటి పేరు ముందు కింగ్‌ అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. 

Add Zee News as a Preferred Source

అలాగే ఈ కింగ్ కోబ్రాలు సాధారణంగా అన్ని పాముల్లా కాకుండా చాలా భిన్నంగా ఉంటాయి. ఈ పాముల్లో ఆడ కింగ్‌ కోబ్రాలు గుడ్లను పెడుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటిని రక్షించుకోవడానికి గూడ్లు కూడా కట్టుకుంటాయి. కింగ్‌ కోబ్రాలు కొమ్మలు, మొక్కల పదార్థాలు, మట్టిదిబ్బలతో ప్రత్యేకమైన గూడ్లను తయారు చేసుకుంటాయి. గుడ్లు పొదిగే వరకు, పిల్ల పాములు బయటకు వచ్చే వరకు తల్లి కోబ్రా గూడు దగ్గరే ఉంటాయి. అంతేకాకుండా పిల్లలను రక్షించుకునేందుకు అవి పెరిగే వరకు అక్కడే కపాలా ఉంటుంది. 

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? కింగ్‌ కోబ్రాల విషం చాలా ప్రమాదకరమైనదని భావిస్తారు. కానీ వీటి విషయం అంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. వీటి విషంలో ప్రధానంగా న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. ఇది కాటేస్తే దాదాపు నాడీ వ్యవస్థపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా వీటి విషం ఒక మనిషిని చంపడమే కాకుండా పెద్ద ఏనుగును కూడా చంపగలుగుతుందని సమాచారం. అయితే ఇటీవలే చాలా మంది ఇంతటి విషం కలిగిన పాములతో ఆడుకకుంటున్నారు. అలాగే కొంతమంది వాటిని పట్టుకుని ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో ఎన్నో వైరల్‌ అయ్యాయి. 

తాజా కింగ్‌ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. గతంలో @నిక్ ది రాంగ్లర్_టీవీ అనే యూట్యుబ్ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేసిన కింగ్‌ కోబ్రా వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు కింగ్‌ కోబ్రాను ముద్దు పెట్టుకోవడం మీరు గమనించవచ్చు. దీనిని ఇప్పుడు నాలుగు లక్షల మందికిపైగా నెటిజన్స్‌ లైక్‌ చేశారు. అంతేకాకుండా చాలా మంది కామెంట్స్‌ కూడా చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని కోట్ల మంది వీక్షించారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News