Red Nagamani: స్కూల్‌లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి

Nagamani Out From King Cobra In A School Its Look Like Red Color Know What Is Fact: పాములపై ఎప్పుడూ ఆసక్తికర వార్తలు, విశేషాలు ఉంటాయి. పాము కనిపించిందంటే భయం కానీ పామును దేవతగా పూజిస్తుంటాం. అయితే పాము తలపై నాగమణి ఉంటుందనేది నిజమా? కాదా? తెలియదు కానీ పాము నాగమణి వదిలేసి వెళ్లిందని పుకార్లు వైరల్‌ అయ్యాయి. ఓ వైరల్‌ వార్త తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 22, 2026, 11:57 PM IST
Red Nagamani: స్కూల్‌లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి

Nagamani News Viral: పాములు అంటే భయమే కానీ పాముల గురించి వార్తలు మాత్రం చాలా ఆసక్తిగా ఉంటాయి. పాములు జంతుజీవుల్లో అది ఒకటి. కానీ పాములకు సంబంధించి మాత్రం ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. పామును దేవతగా పూజిస్తుంటాం. పురాణాల్లో.. ఇతిహాసాల్లో నాగుపాముకు నాగమణి ఉంటుందని ఎన్నో కథలు ఉన్నాయి. కానీ నాగమణి నిజమా? అబద్ధమా? తెలియదు కానీ ఓ చోట నాగుపాము తలపై నాగమణి బయటకు వచ్చిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అది కూడా ఎర్రటి రంగులో మిలమిల మెరిసే నాగమణి కనిపించిందని చర్చ నడుస్తోంది. ఈ వార్త వైరల్‌ అవుతుండగా.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: PM Kisan: రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పీఎం కిసాన్‌ సహాయం డబ్బుల్‌ డబుల్‌

పాము తలపై ఉండే దానిని నాగమణి అని పిలుస్తారు. నాగమణి అనేది పురాణాలు, ఇతిహాసాల్లో విన్నాం కానీ ఎవరూ అది ఉంటుందని పక్కాగా చెప్పలేకపోతున్నారు. కానీ బిహార్‌లోని ఓ పాఠశాలలో నాగుపాము నాగమణిని బయటకు తీసిందని పుకార్లు వస్తున్నాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లా సాహెబ్‌గంజ్‌లోని పాఠశాలలో పాము నాగమణిని బయటకు తీసిందనే వార్త ఆ గ్రామంలో  కలకలం రేపింది. ఆ నాగమణిని చూసేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని వార్తలు వస్తున్నాయి. ఆ పాము తలపై నుంచి ఎర్రటి నాగమణి వచ్చిందని గ్రామస్తులు చర్చించుకున్నారు. తాము చూశామని ఆ గ్రామస్తులు చెబుతున్నారు.

Also Read: KTR: సిట్‌ నోటీసులపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు

అయితే ఈ వార్తలన్నీ పుకార్లు మాత్రమేనని.. వాస్తవం కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు. పాము తలపై నుంచి వస్తే నాగమణి ఫొటోలు, వీడియోలు ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగంటే ఆ పాముకు సంబంధించిన నాగమణి ఫొటోలు, వీడియోలు ఎక్కడా లేవు. కానీ నాగమణి వచ్చిందని మాత్రం ఆ గ్రామంలో చెబుతున్నారు. నాగమణి కనిపించిందనే వార్త పుకారు మాత్రమేనని అలాంటిదేమీ కనిపించలేదని కొందరు చెబుతున్నారు. గమనిక: నాగమణి కనిపించిందనే వార్త ఎప్పుడో జరిగిందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు వైరలవుతోంది.

Also Read: KT Rama Rao: తెలంగాణలో సంచలన పరిణామం.. కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు

వాస్తవంగా పాముపై ఎలాంటి నాగమణి ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాగుపాము వంటి కొన్ని పాము తలలపై మెరిసే లేదా గుండ్రని పొలుసులు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు రత్నాలలా మెరుస్తుంటాయి. ఇక పాముల కడుపులో కనిపించే రాళ్లను కూడా నాగమణిలుగా భావిస్తుంటారు. ఇవన్నీ కూడా పాము శరీరంలో భాగమే. కానీ వాటికి నాగమణి అని చెప్పడం.. వాటికి మాయా శక్తులు, మహిమలు ఉంటాయని భావిస్తుంటారు. కానీ అలాంటేదేమీ లేదని జంతు శాస్త్రవేత్తలు చెబుతన్నారు. ఎవరైనా పాము నాగమణి అని చెప్పి కొన్నింటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తే వాటిని  కొనుగోలు చేసి మోసపోవద్దు. నాగమణికి సంబంధించి వార్త పుకార్లు మాత్రమే వస్తున్నాయి. పాములకు సంబంధించిన వార్తలు అవగాహన కోసం అందిస్తున్నాయి మాత్రమే. వీటిని ప్రజలు ఎక్కడా నమ్మవద్దని జీ తెలుగు న్యూస్‌ సూచిస్తోంది.

Also Read: RMZ Group: ఏపీ ప్రభుత్వంతో ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్‌ భారీ ఒప్పందం.. రూ.లక్ష కోట్ల పెట్టుబడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News