
King Cobra Video Watch Now: సోషల్ మీడియాలో నిత్యం లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు అయితే జంతువులకు సంబంధించినవే ఉంటాయి. చాలామంది యువత వీటికి సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఈ వీడియోలు ట్రెండింగ్ గా కూడా మారుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అదే పనిగా పాములు పట్టుకుంటున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. కొంతమంది అయితే పాములకు సంబంధించిన వీడియోలు భయపడుతూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.
మనం పాములను పంట పొలాల్లో, చిత్తడి నేలల్లో, అప్పుడప్పుడు ఇంటి పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం.. కానీ ఎప్పుడైనా మీరు ఇంటి బీరువాలో పాము దాగి ఉండడం చూశారా? అవును ఇప్పుడు వైరల్ అయ్యే వీడియోలు పాము ఏకంగా ఓ బీరువాలో ప్రత్యక్షమైంది. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు ఏదో ఒక పని మీద డబ్బు కోసం బీరువాలో ఉన్న లాకర్‌ను ఓపెన్ చేశారు. అయితే వారికి ఇంతలోనే బంగారం డబ్బుతో పాటు అత్యంత విషపూరితమైన నాగుపాము కనిపించింది. నాగుపాము కనిపించడంతో వారంతా ఒక్కసారి షాక్ అయ్యారు.
మనుషుల అలికిడిని గమనించిన ఆ నాగుపాము ఒక్కసారి పడగ విప్పి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా ఆ పాము లాకర్లో ఉండే బుసలు కొడుతూ హెచ్చరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. అయితే, ఆ పాము లాకర్ లోకి ఎలా వచ్చిందనే సమాచారం తెలియాల్సి ఉంది.. ఆ కుటుంబ సభ్యులు ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్లే ప్రమాదం తప్పిందని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు.. చూడకుండా లాకర్ ని ఓపెన్ చేసి అందులో చెయ్యి పెడితే దాడి చేసేదని వారు చెబుతున్నారు.
ఈ ఘటనను చూసేందుకు ఇంటి చుట్టూ ఉండే ఇళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారు. ఇందులో ఒకరు స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకొని పామును లాకర్లో నుండి తీసి ఓ డబ్బాలో బంధించి సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెట్టినట్లు సమాచారం.. ఏది ఏమైనా అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లో నివాసముంటున్న వారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే పాముకాటు బారిన పడి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook