King Cobra Snake cute video goes viral: పాములు అని చెప్తేనే జనాలు కిలో మీటర్ ఆగకుండా పారిపోతారు. ఇక పొరపాటున ఎక్కడైన పాములు కన్పిస్తే ఆ ప్రదేశాలకు అస్సలు పోరు. పాముల వీడియోలు నెట్టింట తరచుగా సందడి చేస్తున్నాయి. నెటిజన్ లు సైతం పాములు వీడియోలను చాలా ఇష్టంతో చూస్తున్నారు. సాధారణంగా పాములంటేనే చాలా డెంజర్.. అట్లాంటిది కింగ్ కోబ్రా అంటే ఇంకా ఎంత డెంజర్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.
కింగ్ కోబ్రాలు చిన్న పాముల్ని తరచుగా వేటాడి తినేస్తుంటాయి. ఈ క్రమంలో పాముల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న కింగ్ కోబ్రా వీడియో మాత్రం భయంకరంగా కాకుండా.. క్యూట్ గా ఉంది, అందర్ని ఆకర్శిస్తుంది.
ఈ వీడియోలో.. మరీ స్నేక్ క్యాచర్ చిన్నతనం నుంచి కింగ్ కోబ్రాను పెంచుతున్నాడో మరెంటో కానీ.. అది అతని ఇంటి ముందుకు వచ్చింది. ఆ తర్వాత అతను కింగ్ కోబ్రాను తీసుకుని ఫారెస్ట్ కు తీసుకెళ్లాడు. దాని పడగకు ఒక టెడ్డీబెర్ లాంటి ఉలన్ మాస్క్ ను వేశాడు.
అది చూసేందుకు భయంకరంగా కాకుండా.. ఎంతో అందంగా కన్పిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు బాబోయ్.. కింగ్ కోబ్రాలో ఈ షెడ్స్ కూడా ఉంటాయా..అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.









