King Cobra Snake Romance Video Viral: రెండు పాములు ఒకే చోట చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని అడవి ప్రాంతాల్లో మాత్రమే అప్పుడప్పుడు రెండు పాములు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మగ పాము ఆడ పాము ఒకే చోట కనిపించడం చాలా అరుదుగా అని అందరూ చెబుతూ ఉంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒకే చోట రెండు పాములు నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికీ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నోసార్లు విపరీతంగా వైరల్ అయినప్పటికీ.. ఈ వీడియో చాలా ప్రత్యేకంగా భావించవచ్చు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రెండు ప్రమాదకరమైన నాగుపాములు నడిరోడ్డుపై ఒకదానికొకటి చుట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఈ పాముల్లో ఒక మగ పాము, మరొకటి ఆడదామని చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే, ఈ రెండు పాములు ఒకే చోట రోడ్డుపై చుట్టుకొని ఉండి అటు ఇటు కదలడం కనిపిస్తుంది. అయితే, మేటింగ్ సమయంలో మాత్రమే రెండు పాములు ఇలా ఒకదానికొకటి చుట్టుకొని బిగుతుగా చుట్టుకొని ఆడతాయని సమాచారం. ఇందులో భాగంగానే ఈ రెండు పాములు కూడా ఇలాగే చేయడం మీరు గమనించవచ్చు.
ఆడ పాములు గర్భధారణ కోసం ఇలా మగపాములతో కలుస్తాయని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో పాములు బయటికి రావడం చాలా అరుదని వారు అంటున్నారు. ఈ వీడియోలో రెండు పాములు జనాలు తిరిగే రోడ్డుపైకి రావడంతో వీటిని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. అంతేకాకుండా కొంతమంది పాములు చేస్తున్న వింత కదలికలను చూసి స్మార్ట్‌ఫోన్స్‌లో కూడా వీడియోలుగా చిత్రీకరించారు. ఇప్పుడు ఇవే కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా చేసిన వీడియోలే విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
Also Read: Three Snakes Video: ఒకే చోట మూడు పాములు.. ఏం చేస్తున్నాయో చూడండి..
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను స్నేక్ కార్తీక్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా.. ఒక లక్ష 45 వేలకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను 50 వేల మందికి పైగా షేర్ చేసినట్లు తెలుస్తోంది. జనాలు ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొంతమంది ఎక్కువగా ఇలాంటి పాముల వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.
Also Read: Three Snakes Video: ఒకే చోట మూడు పాములు.. ఏం చేస్తున్నాయో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









