)
King cobra Snake Protects Money Trending Video: చాలా మంది నిధులు ఎక్కడ ఉంటాయో అక్కడ పాములు ఉంటాయంటారు. అందుకే పాములు, తేళ్లు ఎక్కువగా ఉంటే.. అక్కడ కొంత మంది తవ్వకలు చేస్తారు. కొంత మంది భూములు తవ్వుతుంటే, ఇళ్లకోసం పునాదులు తవ్వుతుంటే పాములు బైటపడిన అనేక ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇటీవల పాముల వీడియోలు తెగ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. చాలా మంది వీటిని చూస్తే దూరంగా పారిపోతారు.
మరికొంత మంది మాత్రం పాముల్ని తమఫ్రెండ్స్ లా భావిస్తారు. పొరపాటున పాములు కన్పిస్తే అక్కడికి మరల వెళ్లరు. డబ్బుల దగ్గర పాములు ఉన్న వీడియోలు ఇటీవల నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాములు కొంత మందికి కాటు వేసి చేడు చేస్తున్న కూడా.. మరికొంత మందికి మాత్రం ధనం, నిధులు రాసిపెట్టి ఉన్న వారికి మాత్రం.. పాములు ఏంమనవని చెబుతుంటారు.
ప్రస్తుతం మూడు సర్పాలు పగడవిప్పీ మరీ డబ్బులకు కాపాలా కాస్తున్నాయి. అయితే.. కొంత మంది దీన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మూడు పాములు మాత్రం అస్సలు బుసలు కొడుతూ రచ్చ చేస్తున్నాయి.
కాటువేసేందుకు తెగ ప్రయత్నాలుచేస్తున్నాయి. డబ్బులను మాత్రం ముట్టుకునేందుకు అస్సలు టైమ్ ఇవ్వడంలేదు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. పాములు ఏంట్రా.. ఇంత వైలెంట్ గా ఉన్నాయంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.