Cobra Venom Removing Process Viral Video: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఈ పాము అన్ని పాముల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన చెప్పొచ్చు. ఎందుకంటే దీని విషయం చాలా పవర్ఫుల్.. అంతేకాకుండా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. శత్రువును సులభంగా పసిగట్టి దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముగా పేరుపొందింది. సాధారణంగా పాము విషాన్ని తీసి వివిధ ఔషధాల్లో వినియోగిస్తారని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ కొన్ని ప్రయోగశాలలో నాగుపాములను వందల కొద్ది పెంచుతున్నారు. తాజాగా ఓ పరిశోధన శాలలో పెంచిన నాగుపాము నుంచి విషయాన్ని సేకరిస్తున్న ప్రక్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే ఈ వీడియోను చాలామంది ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
వీడియో వివరాల్లోకి వెళితే ఓ అతి ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పరిశోధన శాఖలో ఓ యువతి కట్టుకోవడం మీరు చూడొచ్చు. అయితే ఆ యువతి ఓ శాస్త్రవేత్త కి పట్టుకున్న పాములు చాలా జాగ్రత్తగా అప్పగించింది. అయితే ఆ వ్యక్తి నాగుపాము తలభాగం ముందు నోరు తెరిచి ఒక చిన్న గాజు సీసాను వచ్చాడు. అయితే ఆ పాము తన నోటి దగ్గరికి గాజు సీసా రావడం గమనించి తనలో ఉన్న విషయాన్ని బయటికి చిమ్ముతుంది. దీంతో ఆ విషయం గాజు సీసాలో పడిపోతుంది. అంతేకాకుండా మీరు నాకు పాము విషాన్ని ఎంతో క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు. ఆ సీసాలు పడుతున్న ఒక్కొక్క బొట్టు అతి ప్రమాదకరమైన విషమే. దీనిని కళ్ళకు కట్టినట్టు ఆ పరిశోధకులు కెమెరాకు చూపించారు.
అంతేకాకుండా ఈ వీడియోలు ఆ శాస్త్రవేత్త వారు రోజు నాగుపాముల నుంచి విషాన్ని ఎలా సేకరిస్తారు అనేది స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ వీడియోని ఇప్పుడు పాములంటే ఎంతో ఆసక్తిగా చూసేవారు ఒకటి నుంచి రెండుసార్లు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పుడు @brianBarczyk అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను ఇప్పటివరకు 92 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని కోట్ల మంది వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









