Huge King Cobra Video: బెడ్ కింద దూరిన 12 అడుగుల అతి పొడవైన కింగ్ కోబ్రా.. వీడియో చూడండి..

Huge King Cobra Video: ఓ ఇంట్లోని 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా బెడ్ కింద నక్కి ఉండడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పామును ఆ ఇంటి యజమానులు ఏం చేశారో.. మీరే ఈ వీడియోలో చూడండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 24, 2025, 02:56 PM IST
Huge King Cobra Video: బెడ్ కింద దూరిన 12 అడుగుల అతి పొడవైన కింగ్ కోబ్రా.. వీడియో చూడండి..

Huge King Cobra Video Watch Here: కొన్ని కారణాలవల్ల అడవుల్లో చెట్ల సంఖ్య తగ్గుతూ రావడంతో జంతువులకు ఆహార కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లోని అడవుల్లో నీటి నీటి వనరులు కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల అనేక రకాల జంతువులు మరణిస్తూ వస్తున్నాయి. కొన్ని జంతువులు మాత్రం ఆహారం కోసం అడవుల నుంచి బయటికి వచ్చి గ్రామాల్లోకి సంచారం చేస్తూ ఉన్నాయి. ఇలా చాలావరకు జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన జాతులు అంతరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉండే పల్లె ప్రాంతాల్లోకి తరచుగా అనేక రకాల జాతులకు సంబంధించిన పాములు సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేయడంతో కొంతమంది జనాలు వీటిని కొట్టి చంపేస్తున్నారు. మరికొంతమందైతే వాటికి ఎలాంటి హాని చేయకుండా సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

అడవుల్లో నుంచి ఇళ్లల్లోకి వస్తున్న పాములను చాలామంది  వాటికి హాని చేయకుండా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది స్నేక్ క్యాచర్స్ ను పిలిపించి వాటిని సురక్షితమైన ప్రదేశాల్లోకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం రోజు చూస్తూ ఉంటాం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అడవికి దగ్గరగా ఉండే ఓ ఇంట్లోకి 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా సంచారం చేసింది. అయితే ఏకంగా ఇది ఆ ఇంటి యజమానులు పడుకునే బెడ్ కింద నక్కింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ స్నేక్ క్యాచర్ ఇంట్లో బెడ్ కింద దూరిన పాము తోక పట్టుకొని లాగడం మీరు గమనించవచ్చు. అలాగే ఆయన ఇంట్లోని చివరి గది అయిన బెడ్ రూమ్‌లో నుంచి ఆ పామును బయటికి తోకతో గుంజుకు రావడం కూడా మీరు చూడవచ్చు. అయితే ఆ స్నేక్ క్యాచర్ పాముని ఇంట్లో నుంచి తీసుకువచ్చి తన సంచిలో బంధించేందుకు ప్రయత్నిస్తాడు. ఆ పాము మాత్రం దాని నుంచి తప్పించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేయడం కూడా మీరు చూడవచ్చు. అంతేకాదండోయ్ ఆ స్నేక్ క్యాచర్ పై దాడి చేయడం కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఆ స్నేహితుడు 10 నిమిషాల తర్వాత 12 అడుగుల అతి పొడవైన కింగ్ కోబ్రా ను తన సంచిలో బంధిస్తాడు. ఇలా బంధించిన పామును అడవిలోని సురక్షితమైన ప్రదేశంలో వదిలేస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News