King Cobra Video: ఊయల ఊగుతున్న కింగ్‌ కోబ్రా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్‌ కోబ్రా ఊయల ఊగుతున్న వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 10, 2025, 02:05 PM IST
King Cobra Video: ఊయల ఊగుతున్న కింగ్‌ కోబ్రా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

King Cobra Viral Video: సాధారనంగా కింగ్‌ కోబ్రాలు అన్ని పాముల కంటే ఎంతో పొడవుగా ఉంటాయి. అంతేకాకుండా ఆగ్నేయాసియాతో పాటు భారత్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి అతి ప్రమాదకరమైన అలవాట్లు ఉంటాయి. ఇవి తమ తోటి పాములను చంపుకుని తినే అలవాట్లను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని చాలా డేంజర్‌ అని చెప్పుకుంటూ ఉంటారు. సాధారనంగా ఈ కింగ్‌ కోబ్రాలోని పెద్ద పాములు 5 నుంచి 6 మీటర్ల పొడవు ఉంటాయని సమాచారం. వాటి శరీరం అన్ని పాముల కంటే చాలా దృఢంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన నునువును కూడా కలిగి ఉంటుందని సమాచారం. 

Add Zee News as a Preferred Source

కింగ్‌ కోబ్రాలు భారీ పరిమాణాలతో పాటు పొడవుగా ఉంటాయి. ఈ పాములు తేత పసుపు రంగుతో పాటు గోధుమ రంగులో లభిస్తాయి. అంతేకాకుండా ఆలివ్ ఆకుపచ్చ, తెలుపు రంగులో కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని కింగ్‌ కోబ్రాలపై తల భాగం చాలా పెద్దదిగా ఉంటుంది. దీనిని చాలా మంది పడగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మనుషులను భయపెట్టేందుకు సహాయపడుతుంది. అందుకే చాలా కింగ్ కోబ్రాలు జంవుతులను బయపెట్టేందుకు పడగలను వినియోగిస్తూ ఉంటాయి. కింగ్‌ కోబ్రాలు సులభంగా వాటి ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. 

కింగ్‌ కోబ్రాలు దట్టమైన అడవులతో పాటు చిత్తడి నెలల్లో జీవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని కింగ్‌ కోబ్రాలు మానవ నివాసాలకు సమీపంగా కూడా  ఏర్పాటు చేసుకుంటాయి. దీని శాస్త్రీయ నామం "Ophiophagus"గా పిలుస్తారు. ఇవి కేవలం బల్లులు, పక్షులు, పాములు చిన్న క్షీరదాలను మాత్రమే చంపుకుని తింటాయి. ప్రధానంగా కింగ్‌ కోబ్రా విషంలో న్యూరోటాక్సిక్ స్వాభావం కలిగి ఉంటుందని సమాచారం. కాబట్టి ఇది ఒక్కసారి దాడి చేస్తే నాడీ వ్యవస్థపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా మరణించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో కింగ్‌ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

తాజా కింగ్‌ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో కూడా విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ కింగ్ కోబ్రా పాము బట్టలు ఆరబెట్టుకునే తీగపై ఊయాలాగా ఊగడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఇలా పాము ఊగుతూ..కింద పడడం గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిని @shatrudhanbabasharpmitra.9733 అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది నెటిజన్స్ వీక్షించారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News