)
King Cobra Viral Video: స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గి.. అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఇంటర్నెట్ వినియోగం కూడా విచ్చల విడిగా పెరిగి పోతూ వస్తోంది. సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం విశేషం.. పాములు సాధరణంగా చాలా ప్రమాదకరమని అందరికీ తెలుసు. అయితే కొంతమంది స్నేక్ క్యాచర్స్ సాహోసోపేతమైన చర్యలకు పాల్పడుతూ పాములు పడుతూ వీడియోలు షేర్ చేసిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాములకు సంబంధించిన ఎలాంటి వీడియోలు నెట్టింట్లో షేర్ చేసిన ఫుల్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన వీడియో తెగ చెక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఓ యువకుడు అర్జెంట్‌గా బాత్రూంలోకి వెళ్లడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ యువకుడు అతడితో పాటు నీటిని కూడా లోపలికి తీసుకు వెళ్లడం చూడొచ్చు. అయితే బాత్రూమ్లోకి ప్రవేశించగానే ఆ యువకుడికి వింత అనుభవం ఎదురవుతుంది. మలవిసర్జన చేసేందుకు వెళిన యువకుడికి బాత్రూమ్లో గిరి నాగు కనిపిస్తుంది. దీంతో ఆ యువకుడు భయంతో బయటికి పరుగులు పెడతాడు.. అలాగే ఈ పాము కూడా బుసలు కొడుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సాధరణంగా పాములు ఇంటి బయట ఉండే బాత్రూమ్స్లోకి ప్రవేశించడం సర్వసాధరణం.. అయితే ఇలా బయటి ఉండే బాత్రూమ్స్లోకి వెళ్లే క్రమంలో ఒకటికి రెండు చూసి వెళ్లడం చాలా మంచిది. లేదంటే అందులో ఏవైనా పాములు సంచారం చేసినప్పుడు దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియోను ఫాన్నీ వీడియో కింద పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులకు అవర్నెస్ వీడియోగా మారింది. ఈ వీడియోను @thevikasyt00 అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు కొన్ని వేయిల మంది వీక్షించినట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.