King Cobra Video: ఓర్నీ ఇలా ఉన్నావేంట్రా.. ఏకంగా కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని ఆ పని చేయడమేంటి? వీడియో..

King Cobra Goosebumps Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడు పాములు పట్టుకుని మెడలో వేసుకుని పళ్ళు కడుక్కుంటున్న సన్నివేశాలు వైరల్ గా మారాయి. చాలామంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 26, 2025, 08:00 PM IST
King Cobra Video: ఓర్నీ ఇలా ఉన్నావేంట్రా.. ఏకంగా కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని ఆ పని చేయడమేంటి? వీడియో..

King Cobra Goosebumps Video Viral: పాములను చూస్తేనే భయపడి పరుగో పరుగని మనుషులైన ప్రతి ఒక్కరు ఇలానే వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది అయితే పాము ఎక్కడో ఉంటే ఇక్కడ కేకలు వేసుకొని పరుగులు పెట్టేవారు కూడా ఉంటారు. ఎందుకంటే పాములు అత్యంత ప్రమాదకరమైనవి. కొన్ని జాతులకు సంబంధించిన పాములైతే వెంటాడి మరి దాడి చేస్తాయి. కానీ కొంతమంది మాత్రం వాటితో సాహసాలు చేస్తూ.. వాటితో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోని వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తారు. అంతేకాకుండా వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ యువకుడు అతి ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో సాహసాలు చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది. 

Add Zee News as a Preferred Source

ఓ నల్లజాతీయుడు భయంకరమైన కింగ్‌కోబ్రాను తన మెడలో వేసుకొని ఎంతో ప్రశాంతంగా పళ్ళు తోముకుంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆ పాము మాత్రం ఎంతో ఆగ్రహంగా ఉండి బుసలు కొడుతోంది. గతంలో ఓ యువతి కూడా వాష్ టబ్బులో భారీ కొండచిలువతో స్నానం చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా మరొక యువకుడు రాత్రి తోడుగా కొండచిలువను పక్కలో పెట్టుకుని పన్న వీడియో కూడా ఎంతో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో మాత్రం ఆ యువకుడు ఏకంగా భారీ అతి ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను మెడలో వేసుకొని పళ్ళు తోముకుంటున్నాడు. ఇప్పుడు ఈ వీడియో కాస్త కూడా ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. 

చాలామంది ఇంటర్నెట్‌లో తమదైన గుర్తింపు పొందడానికి ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నారు. ఈ పనులు చాలా ప్రమాదకరమైనవి అని తెలిసినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా ఇలా ప్రమాదకరమైన సాహసోపేతమైన పనులు చేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పాములు ఒక్కసారి కాటేస్తే తప్పకుండా  ప్రాణాలు కోల్పోయా అవకాశాలుంటాయి. ఇలాంటి పాముతో అతడు విన్యాసాలు చేయడం చూసి ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోను చూసి అతడికున్న ధైర్యానికి సలాం అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములతో ఆడుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే ప్రాణానికే ప్రమాదం.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News