King Cobra Video: బిగ్‌ కింగ్‌ కోబ్రాకి బాకెట్‌తో నీటిని తాగించిన యువకుడు.. అరుదైన వీడియో చూడాల్సిందే..

Very Huge King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బిగ్‌ కింగ్‌ కోబ్రాకి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనికి చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 5, 2025, 05:01 PM IST
King Cobra Video: బిగ్‌ కింగ్‌ కోబ్రాకి బాకెట్‌తో నీటిని తాగించిన యువకుడు.. అరుదైన వీడియో చూడాల్సిందే..

Very Huge King Cobra Video Viral: ప్రస్తుతం చాలా పాములు గుడ్లు పెట్టి వాటిని వదిలేస్తే.. కొన్ని పాములు మాత్రమే చాలా ప్రత్యేకం గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తాయి. ఇలాంటి జన్మనిచ్చే పాముల్లో కింగ్‌ కోబ్రాలు ఒకటి. ఇవి పిల్లలు కనడమే కాకుండా వాటికి ప్రత్యేకమైన గూళ్లను కూడా నిర్మిస్తాయి. కొన్ని కింగ్‌ కోబ్రాలు గూళ్లను పెట్టి.. గుడ్లు పెట్టి పిల్లలను కూడా పెంచుతాయి. సాధారణంగా కింగ్‌ కోబ్రాలు మాంసంతో కూడిన ఆహారాలు మాత్రమే తింటూ ఉంటాయి. అంతేకాకుండా ఇతర పాములను అధికంగా చంపుకుని తింటూ ఉంటాయి. అందుకే దీని శాస్త్రీయ నామం Ophiophagus hannahతో పిలుస్తారు.

Add Zee News as a Preferred Source

కింగ్ కోబ్రాలు చాలా తెలివైన పాములు.. వీటిపై దాడి చేస్తునప్పుడు చాలా అప్రమత్తమవుతాయి. అలాగే ఏవైన కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ప్రదేశాలను పరిశీలిస్తాయి. అంతేకాకుండా ఇవి చాలా ప్రమాదకరమైన పాములు కాబట్టి.. ఇతర జంతువులపై దాడి చేసే క్రమంలో తన శరీరాన్ని నిటారుగా లేపి, మెడ భాగాన్ని వెడల్పుగా చేసి దాడి చేస్తుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు బుసలు కూడా కొడుతూ హెచ్చరిస్తుంది. కింగ్‌ కోబ్రా విషం చాలా శక్తివంతమైనది, అలాగే ప్రమాదకరమని నిపుణులు తెలుపుతున్నారు. ఇది మనుషులపై దాడి చేస్తే దాదాపు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో దాడి చేసి 10 నుంచి 20 నిమిషాల్లో మనుషులు మరణించే ఛాన్స్‌లు ఉన్నాయి. 

సాధారనంగా కింగ్ కోబ్రాలు దక్షిణ, ఆగ్నేయాసియాలోని అడవుల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. ఇవి చిత్తడి నేలల్లో కూడా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం ఆడవుల్లో ఆహారం, నీరు లభించకపోవం వల్ల జనావాసాల్లోకి వస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో వీటిని జనాల నుంచి స్నేక్‌ క్యాచర్స్‌ రక్షిస్తున్నారు. అయితే ఇలా సంచారం చేసే క్రమంలో చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తోంది.

ఈ వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ పెద్ద కింగ్‌ కోబ్రా జనావాసాల్లోకి వచ్చింది. అయితే చాలా దప్పికతో ఉన్న ఈ పాము నీరు ప్రవహించే నల్ల వద్దకి వచ్చి అటు ఇటు చూస్తోంది. అయితే ఇంతలోనే ఓ యువకుడు బకెట్‌ నీటి తెచ్చి పాముకు పట్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ వీడియోలో వైరల్‌ అవుతోంది. గతంలో ఎప్పుడో షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవ్వడం విశేషం. దీనిని @indiawala123 అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News