King Cobra Video: నువ్వు తోపు భయ్యా.. ఏకంగా 10 అడుగుల కింగ్ కోబ్రానే ముద్దు పెట్టేసుకున్నావ్..వీడియో మీకోసమే..

Man Kiss 10-foot King Cobra Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడు పాముతో ఆడుకుంటున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము ప్రశాంతంగా ఉండి అతడు చేసింది చూడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 12, 2025, 07:27 PM IST
King Cobra Video: నువ్వు తోపు భయ్యా.. ఏకంగా 10 అడుగుల కింగ్ కోబ్రానే ముద్దు పెట్టేసుకున్నావ్..వీడియో మీకోసమే..

Man Kiss 10-foot King Cobra Video: పాములపై అనేక సామెతలు ఉండేవి అందులో "పాము కనిపిస్తే చాలు సైన్యం కూడా వణికి పోతుంది", పాములు పాము లాగే చూడాలని రెండు సామెతలు పూర్వికులు ఎక్కువగా మాట్లాడే క్రమంలో వినియోగించేవారు. ఎందుకంటే పాములు ఎంతో ప్రమాదకరమైనవి ఇవి ఒక్కసారి మనుషులపై దాడి చేస్తే తప్పకుండా దాని ప్రభావం ప్రాణాలు కోల్పోయే అంతవరకు ఉంటుంది. అందుకే చాలామంది పాములు కనిపించగానే పది అడుగుల దూరం ఉండి.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కొంతమంది అయితే పాము అక్కడ ఉందని తెలిసి అక్కడికి వెళ్లేందుకు కూడా వెనకాడుతూ ఉంటారు. కానీ ఇటీవలే ఓ యువకుడు ఓ పెద్ద కింగ్ కోబ్రాతో ఆడుకున్నాడు, అంతేకాదండోయ్ ముద్దు కూడా పెట్టేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.  

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఓ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో అన్ని వీడియోల కంటే స్పెషల్ అని చెప్పొచ్చు. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు అతి భయంకరమైన కింగ్ కోబ్రా తో ఆడుకోవడం గమనించవచ్చు. ఆ యువకుడు దట్టమైన అడవిలో సంచారం చేస్తున్న క్రమంలో అతనికి ఓ భారీ కింగ్ కోబ్రాకానిపిస్తుంది దీంతో అతను పరిగెత్తి ఆ పామును పట్టుకుంటాడు. ఎంతో ప్రమాదకరమైన పాముని చేత్తో పట్టుకునే సమయంలో ఆ కోబ్రా తనపై దాడి కూడా చేస్తుంది. అయితే అతను ఏ మాత్రం భయపడకుండా కింగ్ కోబ్రా తలపై కొడతాడు..

ఆ యువకుడు కింగ్ కోబ్రా తో దాదాపు పది నిమిషాల పాటు ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఆ పాము యువకుడి చేతిలో నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంది. మళ్లీ ఆ యువకుడు దానిని పట్టుకొని.. ఆ వ్యక్తి తన తలను పాము తల పక్కన పెట్టి సాహసోపేతమైన విన్యాసాలు చేస్తాడు. ఆ పాము కూడా యువకుడు చేస్తుందంతా గమనిస్తూ ఏమీ తెలియనట్లు ప్రశాంతంగా అలాగే మౌనంగా ఉండిపోతుంది. ప్రస్తుతం ఆ యువకుడు కింగ్ కోబ్రా తో చేసిన విన్యాసాలకు సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిని నెటిజన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. పాముతో ఇలా నిర్లక్ష్యంగా ఆడుకోవడం ప్రాణాలకే ప్రమాదమని వారంటున్నారు. వీడియోల సాహసోపేతమైన, ప్రమాదకరమైన చర్యలకు పాల్పడడం మంచిది కాదని వారంటున్నారు..

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News