Snake catcher playing and caught King Cobra very cleverly: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. సింహం, చిరుత, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించినవి ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్థాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి  చాలా తెలివిగా పట్టేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూట్యూబ్ వీడియో ప్రకారం.. ఈ ఘటన సౌత్ ఆసియాలో జరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా ఓ ఇంటి ఆవరణంలోకి వస్తుంది. ఆ పామును చూసిన ఆడవాళ్లు ఒక్కసారిగా భయపడిపోతారు. విషయాన్ని తెలుసుకున్న ఓ స్నేక్ క్యాచర్ అక్కడికి వచ్చే సమయానికి అది ఓ పరదా కిందకి పోతుంది. అతడు పరదా తీయగానే ఒక్కసారిగా పడగ విప్పుతుంది. నెమ్మదిగా గోడమీది నుంచి పామును నేలపై పడేస్తాడు స్నేక్ క్యాచర్. ఆపై దాని తోకను పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది కాటేయడానికి దూసుకొస్తోంది. అయినా కూడా అతడు భయపడకుండా తోకను అలానే పట్టుకుంటాడు. 



స్నేక్ క్యాచర్ చాలా సమయం ప్రయతించినా.. పాము తన తలను పట్టుకోనివ్వదు. దాంతో ఆ స్నేక్ క్యాచర్ తెలివిగా ఓ కవర్ తెస్తాడు. పడగ విప్పిన పాము తలపై ఆ కవర్ వేస్తాడు. పాము తల కవర్లోకి వెళ్లినా.. అది బుసలు కొడుతోనే ఉంటుంది. ఓ స్టిక్ సాయంతో కవర్ పట్టుకుని పాము మొత్తాన్ని లోపలికి తోసాడు. ఆపై దాన్ని అడవిలో వదులుతాడు. ఇందుకు సంబందించిన వీడియో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన అందరూ 'నీ తెలివికి ఓ దండం సామి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పాతదే అయినా  ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 1,095,372 వ్యూస్ వచ్చాయి. 


Also Read: సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిదో తెలుసా.. అస్సలు ఊహించలేరు!


Also Read: సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'కార్తికేయ 2'... దర్శకుడికి బిగ్ బీ ప్రశంస..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook