King Cobra Vs Cow Video Watch: పాములు అంటే జనాలకు భయమే కాకుండా జంతువులు కూడా అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాయి.. అందుకే అవి దగ్గర దగ్గరికి వెళ్తే జంతువులు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. అన్ని రకాల జంతువులను పాములు తప్పకుండా కాటేస్తూ ఉంటాయి. పల్లె ప్రాంతాల్లో పశువులు పెంచుకునే చాలామంది కి సంబంధించిన ఆవులు గేదెలు పాము కాటు బారిన పడి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొన్ని గేదెలపై పాములు దాడి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ప్రకృతి నియమానికి విరుద్ధంగా ఇప్పుడు కొన్ని స్నేహాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది..
మన ఆశ్చర్యానికి గురి చేసే అనేక సందర్భాలు తరచుగా ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా చాలామంది కుక్కలు కోళ్లు ఇతర జంతువుల పై పెంచుకున్న ప్రేమకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇవి వైరల్ గా మారుతాయి. శత్రు జీవులకు కూడా ఇతర జంతువులను చూస్తే ఎక్కడో ఇంత ప్రేమ కొడుతూనే ఉంటుంది. అంతేకాకుండా పాములు సైతం కొన్ని జంతువులను చూసి ప్రేమతో ఏమాత్రం దాడి చేయకుండా వాటితో ఆడుకుంటూ ఉంటాయి. ఇలాంటి అపురూపమైన వీడియోలు సోషల్ మీడియాలో మనం ఎన్నో చూసుంటాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కింగ్ కోబ్రా, ఆవుకి సంబంధించిన అరుదైన సన్నివేశాలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే సాధారణంగా ఏ ఆవైనా పాములు చూసి తప్పకుండా భయపడి దానికి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మూగజీవులన్నిటికీ ప్రమాదాన్ని పసిగట్టే ప్రత్యేకమైన శక్తి ఉంటుందని మనమంతా నమ్ముతాం. కానీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో కింగ్ కోబ్రా ఆవుకి సంబంధించిన అపురూపమైన స్నేహం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండింటి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోలో.. గోమాత దగ్గరికి పాము వెళ్ళగా.. దానిని ఆవు బిడ్డను నాకినట్టు ఎంతో అపురూపంగా నాకెందుకు ప్రయత్నించింది. ఆ పాము కూడా ఏమాత్రం దాడి చేయకుండా అపురూపమైన స్పర్శను ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయింది ఇలా ఆవు పాముకు మధ్య స్నేహం ఎంతో బాగుండడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.. చాలామంది ఈ వీడియోని చూసి వాటి మధ్య ప్రేమను నమ్మలేకపోతున్నారు. కొంతమంది అయితే ఆశ్చర్యపోయే కామెంట్స్ కూడా చేస్తున్నారు. "పాములంటే గోమాతకు భయంలేదా" అని కొంతమంది కామెంట్స్ పెడితే మరికొందరు "ఈ రెండిటి మధ్య ప్రేమ చూడడానికి చాలా ముచ్చటగా ఉందని" కామెంట్లు రాస్తూ వస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









