)
King Cobras Romance Video Watch: అన్ని కాలాల కంటే వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీటి ప్రవాహం వేగంగా కిందికి రావడం వల్ల పాములన్ని కొట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలాచోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి.. ముఖ్యంగా అడవి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే కొండలపై నుంచి కొట్టుకు వచ్చిన తర్వాత అవి నేరుగా ఇళ్లలోకి సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సమయంలో చాలామంది చాలా జాగ్రత్తగా పాములు కాటు బారిన పడకుండా వారికి వారు రక్షించుకుంటారు. ముఖ్యంగా వర్షాకాల సమయంలో ఆడ పాములతో పాటు మాగ పాములు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయట. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా ఆడ పాముల చుట్టూ మగ పాములు తిరుగుతూ ఉంటాయట.. అంతేకాకుండా ఈ సమయాల్లో జతకట్టేందుకు కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆడ పాములను ఆకర్షించేందుకు మగ పాములు ఎంతగానో వాటిపై ప్రేమ చూపేందుకు ప్రయత్నిస్తాయట.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇదే జరిగింది.. ఓ పాము ఇంకో పామును ఆకర్షించేందుకు ఏకంగా చెట్టుని ఎక్కేసింది. అవును ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ చెట్టు పై రెండు పాములు పడగవిపి కూర్చుని ఉండడం మీరు గమనించవచ్చు. ఇందులోని మగ నాగుపాము ఆడ పామును అపురూపంగా చూస్తుండడం కూడా మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియో చూసిన వారంతా రెండు పాములు ఒక చెట్టుపై కూర్చుని సరసాలు ఆడుతున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ రెండు పాములు ప్రేమలో ఉన్నాయని ఇప్పుడు వర్షాకాలం కావడంతో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మరికొంతమంది చెబుతున్నారు. ఇక మరికొంతమందైతే, ఈ రెండు నాగుపాములు చెట్టుపై కూర్చుని రొమాన్స్ చేసుకుంటున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఓ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook