Snake Charmers Viral Video Watch: ప్రపంచంలో అనేక రకాల ప్రమాదకరమైన పాములకు సంబంధించిన జాతులు ఉన్నాయి. ఇందులో చాలావరకు అతి ప్రమాదకరమైనవే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారుతున్నాయి.. ఇందులో చాలావరకు నాగు పాముల వీడియోలను చూసేందుకు సోషల్ మీడియా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పాములు సయ్యాటలాడడం అలాగే ఒకదానికొకటి దాడి చేసుకోవడం పాములు పట్టుకోవడానికి సంబంధించిన వీడియోలను చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలే చాలావరకు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా పాములకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ గుడిలో కొన్ని పాములు దాడి చేసుకోవడం మీరు చూడవచ్చు. అయితే ఇందులో అన్ని నాగుపాములే ఉండడం చాలా విశేషం. గుడిలో నాగుపాములన్నీ ఒకచోట చేరడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో వాటికవే ఘర్షణకు దిగాయి. ఈ వీడియోను గుడిలో ఉన్న కొంతమంది భక్తులు స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించారు. సాధారణంగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాను భారీ మొత్తంలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
కొంతమంది భక్తులైతే, గుడిలోకి పాములు రావడం చూసి సాక్షాత్తు శివపార్వతులే దర్శనమిచ్చారని అంటున్నారు. సాధారణంగా పాములు గుళ్లోకి రావడం చాలా అరుదు. అయితే ఒక్కసారిగా గుళ్లోకి మూడు పాములు రావడంతో జనాలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా గుడి చుట్టుపక్కల ఉండే చాలామంది అక్కడికి చేరుకొని, ఈ దృశ్యాలను చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోను శుభం ఉమా స్నేక్ క్యాచర్ రాంచి అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. మరి కొంతమంది అయితే ఈ వీడియోను చూసి షేర్ కూడా చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









