Young Man Married Two Women Viral Video: భారత్‌తో ఇద్దరు మహిళల(బహుభార్యత్వం)ను ఒకేసారి పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధమైనప్పటికీ, కొంతమంది తెలిసి తెలియకు చేసుకుంటున్నారు. హిందూ ప్రత్యేకమైన చట్టం ప్రకారం, ఒక వేళ రెండవ పెళ్లి చేసుకోవాలనుకునేవారు తప్పకుండా మొదటి భార్య లేదా భర్తతలకు విడకాలు ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది విడాకులు ఇవ్వకపోయిన చట్ట విరుద్ధంగా పెళ్లిలు చేసుకుంటున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒకే యువకుడు ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం మీరు చూడొచ్చు. ఈ ఘటన గతంలో తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. ఒకే యువకుడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ జిల్లా గుమ్నూర్ గ్రామానికి సంబంధించిన సూర్యదేవ్ అనే వ్యక్తి హిందూ చట్టానికి వ్యతిరేకంగా లాల్ దేవితో పాటు ఝల్కారీ దేవి అనే ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే? ఒకే పెళ్లి వేదికపై ఇద్దరి ఒప్పందతో వివాహం చేసుకోవడం.
ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు
ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించి, ఘనంగా వివాహం చేసుకున్న యువకుడు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న… pic.twitter.com/Tbre507zTB
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025
ఆ యువకుడు ఒకే వేదికపై అంగరంగ వైభవంగా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేస్తున్నాడు. అంతేకాకుండా పెళ్లి పత్రికల్లో కూడా ఇద్దరి పేర్లను ముద్రించారు. అలాగే వేదికకు ఆహ్వానం పలికే ఫ్లెక్సీల్లో కూడా ఇద్దరు మహిళలపై చేయి వేసి దిగిన ఫోటోను ముంద్రించారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా పెళ్లి సమయంలో వీడియోలో ఆ యువకుడు ఇద్దరు యువతుల చేతిని పట్టుకుని ఉండడం మీరు గమనించవచ్చు. ఈ పెళ్లి మూడు కుటుంబాలతో పాటు బంధువులు, గ్రామస్తుల మధ్య ఎంతో ఘనంగా జరిగింది.
మొదట ఈ పెళ్లికి చాలా మంది నో చెప్పినప్పటికీ సూర్యదేవ్ లాల్ ఎంతో కష్టపడి ఇద్దరి సైడ్ బంధువులను ఒప్పించారు. జీవితం మొత్తం ముగ్గురూ కలిసి జీవించాలని నిర్ణయించాలనుకున్నారు. గ్రామ పెద్దలు కూడా ఈ పెళ్లికి వ్యతిరేకించినప్పటికీ చివరికి అందరూ ఒప్పుకున్నారు. ఈ వివాహం 2021 సంవత్సరంలో జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇటీవలే జార్ఖండ్‌లోని లోహర్‌దాగాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









