KSRTC Conductor Video: కండక్టర్ కాదు కామాంధుడు.. రన్నింగ్ బస్సులో యువతి ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ.. వీడియో ఇదే..

KSTRTC Bus Conductor molestaion: బెంగళూరులో కండక్టర్ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో మెల్లగా వెళ్లి ఆమె ప్రైవేటు పార్ట్ లను తాకుతూ పైశాచీకంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది..  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 25, 2025, 04:46 PM IST
  • బస్సులో కండక్టర్ పాడుపని..
  • సీరియస్ అయిన అధికారులు.
KSRTC Conductor Video: కండక్టర్ కాదు కామాంధుడు.. రన్నింగ్ బస్సులో యువతి ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ.. వీడియో ఇదే..

KSRTC bus conductor molested girl in running bus video: ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన, పోలీసులు ఎంత కఠినంగా ఉన్న మహిళలు ప్రతిరోజు వేధింపులు, అత్యాచారాలకు గురౌతునే ఉన్నారు. మొత్తంగా  కామాంధులు గుడి, బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్ అని తేడా లేకుండా మహిళల్ని వేధిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక కండక్టర్ రన్నింగ్ బస్సులో యువతిని వేధించాడు.

Add Zee News as a Preferred Source

బస్సుల్లో ఇటీవల చాలా వేధింపులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. నిద్రిస్తున్న యువతులను టార్గెట్ గా చేసుకుని వేధిస్తుంటారు. ఈ క్రమంలో బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన ఒక కండక్టర్ ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడ్డాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

కర్ణాటకలో నీచమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో  ఒక యువతి ప్రయాణిస్తుంది. ఆమె అలసిపోయి నిద్రలో జారుకుంది. ఇదే అదనుగా భావించిన కండక్టర్  అక్కడకు వెళ్లాడు.

యువతి పక్కన నిలబడి.. ఆమెను తాకుతూ నీచంగాప్రవర్తించాడు. ఆమె ప్రైవేటు పార్ట్ లను తాకుతూ..పైశాచీక ఆనందాన్ని పోందాడు. ఈ ఘటనను అక్కడున్న కొంత మంది ప్రయాణికులు గమనించి వీడియో తీశారు. దీంతో ఇది కాస్త వైరల్గా మారింది.

Read more: Cobra Snake video: ఏంటీ భయ్యా.. పామును చూసి ప్రియురాలు అనుకున్నావా..?.. అట్టా కిస్ పెట్టావ్.. వీడియో వైరల్..

దీంతో నెటిజన్లుదీనిపై చర్యలు తీసుకొవాలని కేఎస్ఆర్టీసీకి ట్విట్ చేశారు. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే ఆ కామాంధుడైన కండక్టర్ ను విధుల్లో నుంచి తొలగించారు.  ఈ క్రమంలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇంత నీచమా.. అంటూ ఫైర్ అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News