kumbh mela viral girl Monalisa dance video: ప్రయాగ్ రాజ్ లో పూసలమ్మడానికి తన కుటుంబంతో వచ్చిన మోనాలీసా ఒక్కసారిగా ఫెమస్ అయ్యిపోయింది. ఓవర్ నైట్ లో ఆమె సుడితిరిగిపోయిందని కూడా చెప్పుకొవచ్చు. ఆమె తేనెకళ్లు, ఏ మాత్రం మేకప్ లేకుండా ఉన్న ఆమె ఇన్నోసెంట్ ముఖం చూసి అందరు ఫిదా అయ్యారు. మోనాలీసా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేశారు.
ఆమె ఎంతగా ఫెమస్ అయ్యిందంటే.. కుంభమేళకు వచ్చిన వారు.. మోనాలీసా కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రస్తుతం మోనాలీసాకు ఫెమస్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాను చేస్తున్నది డైరీ ఆఫ్ మణిపూరీలో హీరోయిన్ గా మోనాలీసాకు చాన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా.. ఆమెకు నటనలో ట్రైనింగ్ కూడా తానే.. దగ్గరుండీ మరీ చూసుకుంటున్నాడు. ఇటీవల మోనాలీసా ఒక జువెల్లరీ షాపు ప్రారంభించడానికి కూడా వెళ్లింది.
ఆ తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ లో తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేసింది. అంతేకాకుండా.. మోనాలీసా తన తల్లికి గోల్డ్ చైన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం మోనాలీసాకు ఇటీవల నేపాల్ లో మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. దీంతో డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో పాటు, మోనాలీసా కూడా వెళ్లారు.
నేపాల్‌లోని మైలాపూర్‌లో నిర్వహించిన మహా శివరాత్రి ఉత్సవాల్లో మోనాలీసా హల్ చల్ చేశారు. ఆమె స్టేజీ మీద అభిమానులను తనదైన స్టైల్ లో పలకరించారు. ఈ క్రమంలో వేదికపై నుంచి మైలాపూర్ లో ఉన్న తన అభిమానుల్ని ఉద్దేశించి ఐలవ్యూ మైలాపూర్ అంటూ అందరిలో జోష్ ను నింపారు.
ఆమెతో ఉన్న సనోజ్ మిశ్రా సైతం.. మోనాలీసా మూవీస్ లో నటన గురించి నేర్చుకుంటుందని కూడా చెప్పారు. ఈ క్రమంలో స్టేజీ మీద డ్యాన్స్ చేస్తు మోనాలీసా రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కుంభమేళ బ్యూటీ వేదికపై నుంచి ఐలవ్ యూ చెప్పడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.









