)
Students Being Beaten Latest Video Viral: యూనివర్సిటీతో పాటు ప్రత్యేకమైన కళాశాల కార్యక్రమాల్లో భాగంగా డాన్సులు, పాటలు పాడడం సర్వసాధారణం. విద్యార్థుల ఆనందం కోసం ప్రత్యేకంగా గాయని గాయకులతో స్టేజ్ పెర్ఫార్మెన్స్లు కూడా అప్పుడప్పుడు కొన్ని కళాశాలలు చేయిస్తూ ఉంటాయి. ఇలా ఇటీవల హర్యానాలో గాయకుడు గుల్జార్ చానిబాల ఓ కళాశాలలో కార్యక్రమానికి పాటలు పాడడానికి వెళ్ళాడు. అయితే, అతను పాడుతున్న సమయంలో విద్యార్థుల మధ్య భీకరమైన ఘర్షణ చెలరేగింది. స్టేజ్ సమీపంలోనే మైదానంలో కొంతమంది విద్యార్థినిలు ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
కళాశాల మైదానంలోనే ఈ కార్యక్రమం జరుగుతోంది.. ఒకవైపు కొంతమంది విద్యార్థులు అంతా పాటలను ఆస్వాదిస్తూ డాన్సులు చేస్తున్నారు. మరి కొంతమంది విద్యార్థులు ఆ గాయకుడితో కలిసి పాటలు పాడుతున్నారు. స్టేజికి అదే సమీపంలో ఉన్న విద్యార్థులు మాత్రం గొడవకు దిగారి. మైదానంలోని ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి జుట్లు పట్టుకొని మరి కొట్టుకున్నారు. అయితే, వారిని ఆపేందుకు అక్కడున్న స్టూడెంట్స్ ఎంత ప్రయత్నించినప్పటికీ.. ఏమాత్రం ఆగకుండా ఒకరినొకరి డ్రెస్సులు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.
ముఖ్యంగా ముగ్గురు యువతులు అయితే.. ఎవరు ఆపిన ఆగకుండా జుట్లు పట్టుకొని, డ్రెస్సులు పట్టుకొని కిందపడి మరీ కొట్టుకున్నారు. ఇలా ఒకరినొకరు విపరీతంగా కొట్టుకోవడంతో ఈ విషయం పోలీసుల వరకు చేరింది. అయితే, ఈ గొడవను ఆపేందుకు అక్కడున్న కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ వారి ప్రయత్నం ఫలించ లేక పోయింది.. వారి ఎంత ఆపిన తగ్గకుండా కొట్టుకున్నారు. అయితే, అక్కడికి వెంటనే పోలీసులు చేరుకొని పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేశారు.
— Anonymous_girl (@srutimisra_789) November 7, 2025
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఘటన మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నగర్లో చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఆ గాయకుడు పాడుతున్న సందర్భంలోనే ఒక్కసారిగా గొడవ చెలరేగిందట.. కానీ బైకు దొంగతనం ఆరోపణపై ఈ గొడవ జరిగిందని అక్కడున్న కొంతమంది స్థానికులు చెబుతున్నారు. అందుకే అందులోనే కొంతమంది పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి