)
Snake Video Viral: ప్రకృతిలో ఆహార చక్రానికి సంబంధించిన అనేక వివరాలు ఎంతో క్లుప్తంగా వివరించారు.. ముఖ్యంగా ఏయే జంతువులు ఎలాంటి ఆహారాలు ప్రకృతి నుంచి తీసుకుంటాయని అంశాల గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు. ఆహార చక్రం ప్రకారం పాములు కప్పలతో పాటు ఎలుకలను ఆహారంగా చేసుకుని తింటూ ఉంటాయి. కానీ ఇప్పుడు దీనికి విరుద్ధమైన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కప్ప ఏకంగా పాము పిల్లను ఆహారంగా చేసుకుని తినడానికి సంబంధించిన ఘటన మీరు చూడొచ్చు. చాలామంది ఈ వీడియోను చూసి కప్ప చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు.
గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. వీడియో వివరాల ప్రకారం.. ఓ మురికి నీటి గుంటలో కప్ప ఉండడం మీరు గమనించవచ్చు అలాగే దాని నోటిలో పామును ఉండడం కూడా మీరు చూడొచ్చు. అయితే, కప్ప నోట్లో ఉన్న పాము ఇంకా ప్రాణాలతోనే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిని గమనించిన స్థానికులు ఈ ఘటనను మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Namami Banerjee (@namami87) September 18, 2025
ఈ వీడియో చూసిన వన్యప్రాణుల సంరక్షణ అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా కొన్ని కొన్ని కప్పలు ఇలాంటి చిన్న చిన్న పాములను కూడా తింటాయని వారు అంటున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా పాములు పిల్లల్ని కట్టాయని ఇలాంటి సందర్భంలోనే కొన్ని పిల్లలు బయటికి సంచారం చేసి ఇలా కప్పలకు ఆహారంగా మారుతాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లో పెద్ద పెద్ద కప్పలు కొన్ని ఇలాంటి చిన్న చిన్న పాములను ఆహారంగా చేసుకుని తింటారని వారు తెలుపుతున్నారు..
ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.. కొంతమంది ఈ వీడియోను చూసి ఆశ్చర్య పోతే.. మరి కొంతమంది కామెంట్లలో కప్పకు మంచి ఆహారం దొరికిందని రాస్కొస్తున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను @namami_banirjee అనే x ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి