)
Large number of lizards in woman house video: సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లుల్ని పెంచుకుంటారు. కొంత మంది రామ చిలుక మరికొంత మంది ఏనుగులు, మేకలు మొదలైన వాటిని పెంచుకుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ కొంత మంది ఇటీవల కాస్తంత అడ్వాన్స్ గా తయారై పాములు, కొండ చిలువలు, భయంకరమైన క్రూర జంతువుల్ని సైతం తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు.
అంతేకాకుండా వాటితో రీల్స్, వీడియోలు తీసుకుంటూ తెగ హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన ఇంట్లో వందల కొద్ది బల్లుల్ని పెంచుకుంటుంది. అంతేకాకుండా వాటిని ఒక కర్టన్ వెనుక వాటిని జాగ్రత్తగా పెట్టింది. ఇక్కడ వందల కొద్ది బల్లులు ఒక దాని మీద ఒకటి కుప్పలుగా గోడల మీద ఉన్నాయి. సాధారణంగా ఒక బల్లిని చూస్తేనే అమ్మాయిలు భయంతో కేకలు పెట్టి ఇల్లంతా పీకి పందిరేస్తారు.
Ye Video Sirf Mahilao Ke Liye Hai ? pic.twitter.com/HOAYYTkSaR
— बाबा ट्विटर वाले (@Babaxwale) August 14, 2025
అలాంటిది ఇక్కడ యువతి మాత్రం అసలు ఏ మాత్రం భయంలేకుండా.. హ్యాపీగా తన ఇంట్లో బెడ్ రూమ్ లో కర్టన్ వెనకాల వందల కొద్ది బల్లులు ఉన్న కూడా ఏ మాత్రం బెదిరిపోకుండా.. కూల్‌గా వాటిని చూస్తు అదేదో వాటి దోస్తులు అయినట్లు వాటిని చూస్తు ఉండిపోయింది.
అయితే.. ఈ వీడియోను ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ బల్లుల గొడవలేంటీ భయ్యా.. అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఎవరైన ఆమె మీదకు వస్తే.. బల్లుల్ని ఉసిగొల్పుతుందేమో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి