Lawyers fighting each other inside sem court in delhi: సాధారణంగా మనం తరచుగా రోడ్ల మీద తప్పతాగిన వాళ్లు గొడవలు పడటం చూస్తుంటాం. అదే విధంగా భార్య భర్తల పంచాయతీల వల్ల రోడ్ల మీద గొడవలు పడటం చూస్తుంటాం. ఇంకా కొన్ని సందర్భాలలో యువకుడి కోసం.. ప్రియురాళ్లు జుట్లు పట్టుకుని గొడవలు పడటం కూడా వార్తలలో చూశాం .
ఇక చిన్న పిల్లలు కొంత మంది తెలిసీ తెలియని వయసులో గొడవలు పడుతుంటారు. ఇదంతా కామన్ గా మనం చూస్తునే ఉంటాం. కొన్ని చోట్ల రౌడీ మూకల గ్యాంగ్ వార్ లు కూడా తరచుగా జరుగుతుంటాయి.
#Delhi #WATCH कृष्णा नगर स्थित स्पेशल एग्जीक्यूटिव मैजिस्ट्रिट (एसईएम) कोर्ट में सिर फुटव्वल। कल क्लाइंट लेने को लेकर कोर्ट में वकीलों ने एक दूसके के सिर फोड़े। दोनों ओर से गैर इरादतन हत्या के प्रयास और लूट की धाराओं में केस दर्ज।@SandhyaTimes4u @NBTDilli #DelhiPolice pic.twitter.com/wh8mGylcjq
— Kunal Kashyap (@kunalkashyap_st) April 16, 2025
అయితే.. ఇక్కడ మాత్రం చట్టాల్ని కాపాడాల్సిన వారు.. ప్రజలకు న్యాయం అందించేవాళ్లు కొట్టుకొవడం సంచలనంగా మారింది. అది కూడా కోర్టు హల్ లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు.. వీళ్లు లాయర్ల లేదా వీధి రౌడీలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ కృష్ణ నగర్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు లోపల ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా క్లయింట్ ల విషయంలో లాయర్ లు రెండు గ్రూప్ లుగా విడిపోయారు. ఈ క్రమంలో వీరి మధ్యకోర్టులో మాటా మాట పెరిగింది.దీంతో రెండు గ్రూప్ ల లాయర్లు ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారు. గిల్లుకుంటూ, చెప్పులతో కూడా కొట్టుకున్నారు.
మరికొందరు నెమ్ ప్లేట్ లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన అక్కడ ఒక రౌడీల మాదిరిగా రచ్చగా మారింది. అక్కడ పలువురికి రక్తం కూడా బైటకు వచ్చే వరకు కొట్టుకున్నారు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. చాలా సేపటి తర్వాత పోలీసులు వచ్చి ఇరు గ్రూప్ లపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది.
ఈ ఘటనపై బార్ అసోసియేషన్ కూడా సీరియస్ అయ్యింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. న్యాయవ్యవస్థ ఇజ్జత్ తీశారని అక్కడున్న జడ్జీ లాయర్లపై మండిపడ్డారు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









