Leopard attack on pet dog in pune video: సాధారణంగా అడవికి దగ్గరగా ఉన్నగ్రామాల్లో తరచుగా క్రూర జంతువులు వస్తుంటాయి. మనం ఏనుగులు, చిరుతలు, అడవి పందులు, ఎలుగు బంట్లు, విష సర్పాలు గ్రామాలపైకి రావడం చూస్తుంటాం. ఈ క్రమంలో చాలా మంది అడవులలో చెట్లు కొట్టేస్తున్నారు. జంతువుల భూభాగంను ఆక్రమిస్తున్నారు. దీంతో వాటికి సరైన ఆహారం, నీరు దొరక్క అవి గ్రామాల మీద పడుతున్నాయి. ముఖ్యంగా అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల మీద క్రూర జంతువులు తరచుగా దాడులు చేస్తుంటాయి. రాత్రి పూట ఎక్కువగా సంచరిస్తాయి.
అంతే కాకుండా.. క్రూర జంతువుల దాడుల నేపథ్యంలో చాలా మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. రాత్రి పూట చిరుతలు కుక్కల్ని, ఆవులు, గేదెలు, మేకలు మొదలైన వాటిపై దాడులు చేసిన ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక చిరుత పూణేలో ఇంటి ఆవరణలో ప్రవేశించింది. అక్కడ బెడ్ మీద పడుకుని ఉన్న ఓనర్ కింద ఉన్న పెంపుడు శునకంను చూసింది. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది.
Pune Viral Video: Leopard Attacks Sleeping Pet Dog While Owner Remains Engrossed In Phone
The video is from Degaon village in Bhor taluka pic.twitter.com/zSXCibzwjI
— Pune First (@Pune_First) March 12, 2025
రాత్రి పూట చిరుతలు ఎక్కువగా వేటాడుతుంటాయి. పూణేలోని దేగావ్ లోని భోర్ గ్రామంలో.. జయనంద్ కాలే అనే వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను.. తన ఇంట్లో రాత్రి పూడ పడుకుని ఉన్నాడు. ఇంతలో ఒక చిరుత మెల్లగా అతని బెడ్ దగ్గరకు వచ్చింది. అతను ఫోన్ లో బిజీగా ఉన్నాడు.
చిరుత మెల్లగా బెడ్ కింద నిద్రిస్తున్న కుక్కను చూసింది. మెల్లగాదాని దగ్గరకు వెళ్లి పీక పట్టుకుని అక్కడి నుంచి సెకన్ ల వ్యవధిలో పారిపోయింది. అతను ఏమైందని చూసేలోపు.. చిరుత పరారైంది. చిరుత పులి కదలికలు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఒక వేళ ఆ చిరుత.. అతనిపై దాడి చేస్తే పరిస్గితి ఏంటని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









