Leopard Video: పోలీస్ స్టేషన్‌లో ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి.. గదిలో చక్కర్లు కొడుతూ ఇన్స్ పెక్షన్..!.. వీడియో ఇదే..

Tamil nadu Video: పీఎస్ లో చిరుత ఒక్కసారిగా లోపలికి ప్రవేశించింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 29, 2025, 03:53 PM IST
  • పీఎస్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత..
  • వీడియో వైరల్..
Leopard Video: పోలీస్ స్టేషన్‌లో ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి.. గదిలో చక్కర్లు కొడుతూ ఇన్స్ పెక్షన్..!.. వీడియో ఇదే..

Leopard Enters Police station in Naduvattam video: ఇటీవల చిరుతపులులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో  ముఖ్యంగా రాత్రిపూట క్రూర జంతువులు అడవికి దగ్గరగా ఉన్న చోటకు వస్తున్నాయి. పెంపుడు కుక్కల మీద దాడులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలోని ఇళ్లలో చిరుతలు ఎక్కువగా బైటకు వస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే చిరుతల భయానికి చాలా చోట్ల రాత్రిపూట బైటకు వెళ్లేందుకు కూడా జనాలు భయపడిపోతున్నారు.  అయితే.. తమిలనాడులోని ఒక పీఎస్ లో ఒక చిరుత ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

తమిళనాడులోని ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో నిన్న(సోమవారం) ఒక చిరుత ప్రవేశించింది. అది ఏంచక్కా.. అటు ఇటు తిరుగుతూ లైట్ ఉన్న రూమ్ లోకి ప్రవేశించింది. ఇంతలో అదే గదిలో ఉన్న కానిస్టేబుల్ మెల్లగా చిరుతను గమనించాడు. చడి చప్పుడు చేయకుండా.. అది బైటకు వెళ్లగానే బైటకు వచ్చి డోర్ ను లాక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మబాబోయ్ బతికిపోయాన్రా..అంటూ ఊపిరిపీల్చుకున్నాడు.

Read more: Lovers Romance Video: బైట దంచికొడుతున్న వాన.. కారులో ప్రియురాలితో టెంప్ట్ అయిన యువకుడు.. నెట్టింట రచ్చగా మారిన వీడియో..

ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ముఖ్యంగా .. నడువట్టం ప్రాంతంలో చిరుతల సంచారం ఇటీవల ఎక్కువైందని, అటవీ శాఖ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చిరుతలను బంధించి తమను కాపాడాలని కూడా ఫారెస్ట్ అధికారుల్ని కోరుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News