)
Lion Giving Funny Expression After tasting cabbage Trending Video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలు చూస్తుంటే నవ్వులు తెప్పించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యంకు గురిచేసేవిలా ఉంటాయి. ఈ క్రమంలో తరచుగా అడవిలో ఉంటే క్రూరమైన జంతువుల వీడియోలు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
కొన్నిసార్లు సింహాలు, చిరుత పులులు, ఎలుగు బంట్ల వీడియోలు, పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి . నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. కొంత మంది జంతువులు ఉన్న ఎన్ క్లోజర్ లకు వెళ్తుంటారు. అక్కడ నోరులేని జంతువుల దగ్గర తమ పైత్యం చూపిస్తారు.
కొంత మంది క్రూర జంతువుల మీద రాళ్లు విసిరితే, మరికొంత మంది ఏదైన తినేపదార్థాలు కూడా వేస్తారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. తాజాగా.. ఒక బోనులో సింహం ముందు కొంత మంది క్యాబేజీని వేశారు. అది ఏదో మాంసం ముద్ద అనుకుంది.
కానీ అది టెస్ట్ చేసేసరికి అది తాను తినని పదార్థం అని తెలిసి కోపంతో గాండ్రించింది. అడవికి రాజైన నన్నే మోసం చేస్తారా..?.. అంటూ సింహం కోపంతో గర్జించింది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.