Lock Viral Video: చాలా సందర్భంలో ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తాళం చెవి పోగొట్టుకునే పరిస్థితిలో ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన తర్వాత సుత్తి లేదా రంపానికి పని చెప్పాల్సి వస్తుంది. దీంతో ఇంటి గొళ్లెం కూడా ఒక్కోసారి పాడైపోయే పరిస్థితిలో ఏర్పడతాయి. అయితే కొత్తగా ఒక ట్రిక్ తో దొంగలు ఎలా తాళం పగలగొడతారో మీరు చూడండి.. దీనికి ఏ సుత్తి, రంపం అవసరం లేదు కేవలం చిన్న ట్రిక్ పాటించి తాళం ఊడి వచ్చేలా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ స్మార్ట్ టెక్నిక్ తో ఎప్పుడైనా తాళం చెవి పోగొట్టుకుంటే మీరు కూడా ప్రయత్నించండి. సులభంగా తాళం ఊడి వస్తుంది. సాధారణంగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టినప్పుడు శబ్దం వస్తుంది. అందుకే వారు అప్రమత్తంగా ఈ ట్రిక్ పాటిస్తారట. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద తాళాలు ఇంటికి వేసినప్పుడు సులభంగా ఈ తాళం ఊడి వచ్చేలా ట్రిక్ పాటించండి. కేవలం 30 సెకండ్లలో తాళం ఓపెన్ అయపోతుంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి సిరంజిలో పెట్రోల్ నింపుకొని తాళంలో కొన్ని చుక్కలు అన్ని వైపులా పోశాడు. ఆ తర్వాత అగ్గిపెట్ట తీసుకొని పుల్లతో వెలిగించాడు. తాళం మొత్తం మండిపోయింది. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక్కసారి నొక్కగానే తాళం ఊడి వచ్చేస్తుంది. ఈ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఈజీగా తాళం ఊడి వస్తుందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం పెట్రోల్, సిరంజి, అగ్గిపెట్టతో ఎంత గట్టి తాళమైనా ఊడి రావాల్సిందేనట.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఈ చిన్న పనిచేస్తే రూ.2000 మీ ఖాతాల్లో పడిపోతాయి..
ఈ వీడియో @explore_vadodara0506 అని ఇన్‌స్టా పేజీ వేదికగా షేర్ చేశారు. అప్పటి నుంచి 3 లక్షల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని రోజులు మాకు తెలవదు బ్రో అవగాహన కల్పిస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాళంలో పెట్రోల్ పోసినప్పుడు అందులో ఉండే ఒక లేయర్ వేడికి కరిగిపోతుందని చెప్పాడు. ఆ తర్వాత సులభంగా తాళం ఊడి వస్తుంది.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. వీరికి కోరుకున్న ఉద్యోగం, పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









