
Lovers Romance On Bike Video Viral: వెర్రీ ప్రేమ పీక్స్ లెవల్లోకి వెళితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ప్రేమికులు వింత చేస్టాలు ఎప్పుడు చేస్తారో తెలుసా? తరచుగా ప్రేమ జంటలే ఎందుకు వైరల్ అవుతున్నాయి? ఇలా ప్రశ్నలు ఎన్నైనా సమాధానం ఒకటే.. చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్త పరచడానికి వివిధ మార్గాలను ఆశ్రయిస్తారు. కొంతమంది సర్పైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటే, మరికొంతమంది విచిత్రంగా చేయకూడని పనులు చేస్తారు. అయితే ఇటీవలే ఓ జంట ఇదే పని చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఇంతగా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బైక్‌పై ఓ ప్రేమ జంట వింతగా ప్రవర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎవ్వరు ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు యువతిని రివర్స్‌లో కూర్చొబెట్టుకుని, ఆమెతో రొమాన్స్ చేయడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జంట బైక్ నడుస్తుండగానే ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకోవడం మీరు గమనించవచ్చు.
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 26, 2025
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆ జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా ప్రమాదకరంగా ఇలా డ్రైవ్ చేస్తూ రోమాన్స్ చేయడం వారికే కాకుండా ఇతరకు కూడా మంచిది కాదని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. ఈ వీడియోలో ఒకరి ఒకరు గట్టిగా హగ్ చేసుకోవడం కూడా మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియోను తమ బైక్ వెనకాలోనే వస్తున్న కారులో ఉన్న కొంతమంది చిత్రికరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సంఘటన బెంగళూరులోని సర్జాపుర మెయిన్ రోడ్డులో జరిగిందని తెలుస్తోంది.
అయితే ఈ వీడియో పోలీసులకు చేరడంతో..పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి ఇలా డ్రైవ్ చేస్తున్న వారిపై తప్పకుండా పలు రకాల చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను చాలా మంది వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook