Easy Money Ideas: సోమరితనం కూడా కొన్నిసార్లు మంచిదే అని ఈ అమ్మాయి చేసిన పని చెబుతోంది. బద్దకంతో బెడ్‌పై పడుకుని తన సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ పెట్టడం ద్వారా ఒక్క రోజుకే రూ.35 లక్షలు సంపాదించింది. సోషల్ మీడియా ద్వారా ఆదాయం సంపాదించి అందరినీ విస్తుగొల్పింది. అయితే తన సంపాదనపై ఏడిచేవారికి కొన్ని సూచనలు చేసింది. ఇదంతా తాను కష్టపడిన సంపాదనే అని 'నన్ను ఏడవకురా' అనే సామెతను గుర్తుచేసింది. ఇంతకీ ఆమె చేసిన పనేమిటి? అంత ఆదాయం ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
Also Read: Jallikattu: సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో తీవ్ర విషాదం.. జల్లికట్టులో యువకుడి మృతి
సోషల్ మీడియాను చెత్తగా కాకుండా మంచిగా ఉపయోగించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. లాభాలే కాదు ఆదాయం కూడా సంపాదించవచ్చు. అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన గు క్సిక్సి అనే యువతి భారీగా డబ్బులు సంపాదిస్తోంది. ఒకరోజు బద్దకంగా ఉన్నరోజు ప్రయోగాత్మకంగా ఓ పని చేసింది. అంతే ఊహించని రీతిలో డబ్బు వచ్చిపడింది. ఆమె చేసిందంతా ఏమీ లేదు బెడ్‌పై అలా పడుకోవడమే. బెడ్‌పై పడుకోవడం ద్వారా రూ.35 లక్షలు సంపాదించింది. ఆమెవరో కాదు చైనాకు చెందిన గు క్సిక్సి.
Also Read: Nara Lokesh Pic Viral: క్రికెట్ మ్యాచ్‌లో నారా లోకేశ్.. ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం
అలా బెడ్‌పై బద్దకంగా పడుకోవడంతోపాటు మరికొన్ని కార్యక్రమాలు చేయడంతో ఆరు రోజులకే రూ.12 కోట్లు సంపాదించేసింది. మనం జీవితంలో సంపాదించాల్సిన డబ్బును ఆమె ఒక్క వారం రోజుల్లోనే చేయడంతో నెటిజన్లు విస్తుగొలిపారు. ఫిబ్రవరి 8వ తేదీన బద్దకంగా బెడ్‌పై పడుకుని ఉంది. పడుకునే ముందు తన సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ (ప్రత్యక్షప్రసారం) చేసింది. ఆ లైవ్ స్ట్రీమ్‌లో ఆమె చేసిన కేవలం నిద్రపోవడమే.
అలా బెడ్‌పై నిద్రపోవడం ద్వారా ఒక్క రోజులో 41 వేల అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.35 లక్షలు) సంపాదించినట్లు గు క్సిక్సి వెల్లడించింది. ఇక 16వ తేదీ వరకు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా గూ క్సిక్సి 10.39 మిలియన్ యువాన్లు (భారత కరెన్సీలో రూ.12.1 కోట్లు) సంపాదించింది. ఈ విషయాలను ఆమె వెల్లడించగా నెటిజన్ల నుంచి ట్రోల్ మొదలైంది. అయితే వారి ట్రోలింగ్‌కు గూ క్సిక్సి ముకుతాడు వేసింది. 'ఇది అంతా నేను కష్టపడి సంపాదించిన డబ్బు' అని పేర్కొంది. గూ క్సిక్సి చైనాలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కొనసాగుతున్నారు. ఆమె నెల సంపాదన రూ.కోట్లలో ఉంటుంది. బెడ్ మీద పడుకుని రూ.35 లక్షలు సంపాదించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి ఉద్యోగం ఏమైనా వెంటనే మేం చేస్తామని నెటజన్లు కామెంట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









