Viral Video: మాఘీ పౌర్ణమి వేళ అద్భుతం.. శివలింగాన్ని ఆభరణంలా చుట్టుకున్న నాగు పాము.. వీడియో వైరల్..

Maghi Purnima festival: శివాలయంలో నాగు పాము ప్రవేశించింది. అంతే కాకుండా.. అక్కడ శివుడి లింగంను చుట్టుకుని కాసేపు అలాగే ఉండిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 13, 2025, 04:39 PM IST
  • ఏపీలో గుడిలోకి ప్రవేశించిన నాగు పాము..
  • భక్తి పారవశ్యంలో నెటిజన్లు..
Viral Video: మాఘీ పౌర్ణమి వేళ అద్భుతం.. శివలింగాన్ని ఆభరణంలా చుట్టుకున్న నాగు పాము.. వీడియో వైరల్..

Cobra snake wrapped around Shiva Lingam in vizag video: సాధారణంగా కొన్నిసార్లు జంతువులు గుళ్లలో ప్రవేశిస్తుంటాయి. మరీ అవి కూడా మనుషుల్లా పూజలు చేయాలనుకుంటాయో ఏంటో కానీ.. అవి దేవుడి గుడుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటాయి. ఇటీవల కొన్ని జంతువులు దేవుడి విగ్రహాలను కొలవడం వార్తలలో నిలిచింది. కొన్ని రోజుల క్రితం శనీ సింగ్నాపూర్ లోని ఒక ఆలయంలో పిల్లి దేవుడి ఆలయం చుట్టుచాలా సేపు తిరిగింది.

Add Zee News as a Preferred Source

అదే విధంగా ఒక ఆంజనేయ స్వామి ఆలయంలో కోతి గదను పట్టుకుని హనుమంతుడి విగ్రహాం దగ్గర చాలా సేపు అలానే కూర్చుంది. మరొవైపు  ఇటీవల ఒక ఎలుగు బంటి శివలింగం పైకెక్కి.. అచ్చం మార్కెండేయుడిలా గట్టిగా పట్టేసుకుంది.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక పాములు కూడా అనేక దేవాలయాల్లో సడెన్ గా వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో భక్తులు సైతం ఆ దేవుడి మహిమ అంటూ ఆనందంతో పొంగిపోర్లి పోయారు.

 

ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో మాఘీ పౌర్ణమి వేళ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ లోని  చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న శివాలయంలో ఈ ఘటన సంభవించింది. ఇది ప్రస్తుతం వైరల్గా మారింది. స్థానికంగా ఉన్న శివాలయంలో ఒక నాగు ప్రవేశించింది. చాలా సేపు అది శివలింగంపైన ఎక్కి పడగ విప్పి కూర్చుంది. అక్కడి  భక్తులు నాగు పామును చూస్తు ఉండిపోయారు.

Read more: Viral Video: వాలెంటైన్స్ డే వేళ రెచ్చిపోయిన ప్రేమ జంట.. రోడ్లపైన డెంజరస్ స్టంట్లు.. వీడియో వైరల్..

పాము మాత్రం కదలకుండా.. శివలింగంపైన ఉండిపోయింది. ఇదంతా శివయ్య మహిమే అంటూ అక్కడి వారు చాలా సేపు భక్తితో పూజలు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు భక్తితో దండం పెట్టకుంటున్నారు. మాఘీ పౌర్ణమి వేళ శివయ్య.. నాగన్న రూపంలో దర్శన మిచ్చాడని కొంత మంది ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News