Viral Video: ఐఐటీ బాబాపై దాడి... టీవీ లైవ్ డిబెట్‌లో చావ బాదిన సాధులు.. వీడియో వైరల్...

Attacks on maha kumbh iit baba: కుంభమేళ ఫెమ్ ఐఐటీ బాబాపై ఒక టీవీ డిబెట్ లో దాడి జరిగింది. ఆయనను కొంత మంది సాధులు రౌండప్ చేసి మరీ కొట్టారని ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2025, 01:24 PM IST
  • ఐఐటీ బాబాపై దాడి..
  • వైరల్ గా మారిన వీడియో..
Viral Video: ఐఐటీ బాబాపై దాడి... టీవీ లైవ్ డిబెట్‌లో చావ బాదిన సాధులు.. వీడియో వైరల్...

Attacks on Maha kumbh iit baba in tv debate video: హర్యానాకు చెందిన అభయ్ సింగ్ కుంభమేళకు వచ్చారు. లక్షల శాలరీని వదులుకుని ఆయన బాబాలాగా అవతారమెత్తారు. ఇటీవల ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళలో ఈ ఐఐటీ బాబా చాలా  ఫెమస్ అయిపోయారు. మహా కుంభ్ లో ఆయనను చాలా మంది ఐఐటీ బాబాగా  పిలిచేవారు. ఆయన ఇటీవల తరచుగా వివాదాల అంశాలతో వార్తలలో ఉంటున్నారు. ఐఐటీ బాబా అసలు బాబా కాడని, ఆయన సన్యాసం తీసుకొలేదని గాంజా తాగే అలవాటు ఉందని కొంత మంది ప్రచారం చేశారు.

Add Zee News as a Preferred Source

అంతే కాకుండా.. ఆయనకు మహిళలతో ఎఫైర్ లు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది.ఈ క్రమంలో ఇటీవల ఐఐటీ బాబా పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోతుందని ప్రిడిక్షన్ చెప్పారు. కానీ భారత్ అనూహ్యాంగా గెలవడంతో..ఐఐటీ బాబాను సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేశారు. దీంతో దిగొచ్చిన ఐఐటీ బాబా సోషల్ మీడియా వేదికగా సారీ చెబుతు మరో వీడియోను రిలీజ్ చేశారు.

 

ఈ నేపథ్యంలో ఐఐటీ బాబా ఇటీవల నోయిడాలో ఒక టీవీ ఛానెల్ డిబెట్ లో పాల్గొన్నారు. ఆయనను కొంత మంది లైవ్ లో సాధులు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నిలదీశారు. దీంతో ఐఐటీ బాబా వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయిన కూడా సాధులు ఆయనను వదల్లేదు. మొత్తంగా ఆయనను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది.

 ఇతను అసలు ఐఐటీ బాబా కాదని, ఆయనకు మన ధర్మం పట్ల ఒక్క ముక్కకూడా తెలీదని, కేవలం ఏదో ఫెమస్ అయిపోవాలని కాషాయ దుస్తులు ధరించిలేనీపోనీ విధంగా కాంట్రవర్సీలుగా మారుతున్నాడని సాధులు మండిపడ్డారు.

ఆయనను వెంటనే మెంట్ ఆస్పత్రిలో జాయిన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.ఈ క్రమంలో ప్రస్తుతం  అభయ్ సింగ్.. సెక్టార్ 126 లోని పోలీస్ స్టేషన్ ముందు నిరసనలు చేశారు. తనపై టీవీ డిబెట్ లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.

Read more: Monalisa Video: ఫైనల్‌గా స్టేజీ మీద ఐలవ్‌యూ చెప్పేసిన కుంభమేళ బ్యూటీ.. వైరల్ గా మారిన మోనాలీసా వీడియో..

ఈ క్రమంలో పోలీసులు ఐఐటీ బాబాతో మాట్లాడి ఆయనను పంపించి వేశారు. ఇప్పటి వరకు దీనిపై ఐఐటీ బాబా తమకు లిఖిత పూర్వకమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఐఐటీ బాబాపై .. టీవీ లైవ్ లో దాడి ఘటన, వాగ్వాదంకు చెందిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News